బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఒకవైపు హీరోగా నటిస్తూనే నిర్మాతగా రాణిస్తున్నాడు. ప్రొడ్యూసర్‌గా కొత్తవాళ్లతో సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. తాజాగా సల్లూభాయి..ఆయన చెల్లెలు ఆర్పితా భర్తైన ఆయుశ్ శర్మను హీరోగా పరిచయం చేస్తూ అభిరాజ్ మినేవాల్ దర్శకత్వంలో ‘లవ్‌రాత్రి’ అనే సినిమాను తెరకెక్కించాడు.  అయితే ఈ సినిమాపై మొదటి నుంచి రక రకాల వివాదాలు తెరపైకి వస్తున్నాయి.  ఈ సినిమా హిందూ సంస్కృతి దెబ్బతినే విధంగా కొన్ని సీన్లు కనిపిస్తున్నాయని హిందూ సంఘాలు విమర్శిస్తున్నాయి. 

అంతే కాదు ఈ సినిమా రిలీజ్ అయితే యువత పెడద్రోవ పట్టే విధంగా ఉంటుందని వారు ఆరోపిస్తున్నారు.   అయితే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తలెత్తిన ప్రేమకథాంశంతో ఈ సినిమా రూపొందింది. తొలుత ఈ సినిమాకు ‘లవ్ రాత్రి’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసింది. ఇదిలా ఉంటే..పలు హిందూ సంఘాలు పవిత్రమైన నవరాత్రి ఉత్సవాలను కించపరిచే విధంగా టైటిల్‌ ఉందంటూ ఆందోళనలు చేశారు.

టైటిల్ మార్చాలని డిమాండ్ చేయడంతో  తప్పని సరి పరిస్థితిలో  సల్మాన్  ఈ సినిమా టైటిల్ ‘లవ్ యాత్రి’గా మార్చారు.  కానీ కొన్ని హిందూ సంఘాలు మాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. గతంలో హిందూ సాంప్రదాయలు బ్రస్టు పట్టించే విధంగా సినిమాలు వచ్చాయని..ఈ సినిమా కూడా అలాంటిదే..అని ఇలాంటి సినిమా తీసి క్యాష్ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని వారు ఆరోపిస్తున్నారు. 

అంతే కాదు  సల్మాన్‌పై బెదిరింపులకు కూడా పాల్పడుతున్నాయట. దీంతో గురువారం సల్మాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా ఈ కేసును పరిశీలించేందుకు అంగీకరించారు. అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: