దర్శకుడు పూరీ జగన్నాధ్ సహజంగా తన పనులు తాను చేసుకుంటూ పోతాడు. చెప్పాల్సిన మాటలను కూడా తన స్టైల్ లో పంచ్ డైలాగ్స్ ఫార్మాట్ లోనే చెబుతాడు. తనకంటూ ఫిక్స్ చేసుకున్న రెగ్యులర్ ఫార్మాట్ ను ఫాలో అవడం తప్ప.. వేరే వాటిని అంతగా పట్టించుకోడని ఇండస్ట్రీ జనాలు అంటుంటారు. ఇవే లక్షణాలు పూరీ సృష్టించే హీరో పాత్రల్లోనూ.. చిత్రంలోనూ కనిపిస్తుంటాయి. తెరపై అన్నిరసాలను సమపాళ్లలో చూపించే అసలుసిసలైన దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.  టైటిల్ కార్డు నుంచి పోస్టర్ వరకు అన్నీ వెరైటీగా చూపించి....ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించే సత్తాగల డైరెక్టర్ పూరి జగన్నాధ్.  చిన్న నాటి నుంచి చిత్రాల్లో నటించాలి..తెరపై తన బొమ్మ ఒక్కసారన్నా చూసుకోవాలని ఆశతో ఉండే వాడు.   


ఇండస్ట్రీలోకి రావాలని కోరిక...ఎలా రావాలో తెలియదు..అందుకే చదువు మధ్యలో ఆపేసి హైదరాబాద్ చేరుకున్నాడు.  ఇండస్ట్రీలో తెలిసినవారు లేకపోవడంతో ప్రవేశం దొరకలేదు...ఆ గ్యాప్ ను దూరదర్శన్‌లో సీరియల్స్ తీస్తూ కాలం గడిపాడు. ఆ క్రమంలో పరిచయమైన కృష్ణవంశి...పూరీని రామ్ గోపాల్ వర్మకు పరిచయం చేయడం...ఆయన దగ్గర పూరీ దగ్గర అసిస్టెంట్‌గా చేరడం వెంటవెంటనే జరిగిపోయాయి. అలా వర్మ కార్పోరేషన్‌లో రెండేళ్లు అసిస్టెంట్ గా పనిచేశాడు.


మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన పవన్ కళ్యాన్ కి మంచి హిట్ అవసరం ఉన్న సమయంలో 1998లో పవన్ కళ్యాణ్‌ని కలిశాడు. పూరీ చెప్పిన కథకు పవన్ ఇంప్రెస్ కావడంతో ‘బద్రి’ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. దీంట్లో పూరీ టేకింగ్ స్టైల్ అందరినీ అలరించింది.  ఆ తర్వాత బాచి చిత్రం అట్టర్ ఫ్లాప్ కావడంతో..దర్శకుడిగా సెట్ కాడని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా రవితేజ తో ‘ఇట్లు శ్రావణి సుబ్రమాణ్యం’ చిత్రంతో మరో విజయం అందుకున్నాడు.  ఈ చిత్రంలో ఆత్మహత్యలపై మంచి సందేశాన్ని కూడా అందించాడు పూరీ. తర్వాత రవితేజతో ‘ఇడియట్’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. 


మాస్ హీరో అంటే ఇలాగే ఉంటారని..అటు రవితేజకు..తనకు అద్భుతమైన ఫ్లాట్ ఫామ్ ఏర్పాటు చేసుకున్నాడు.  ఇడియట్ ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్లీ రవితేజ నే హీరోగా పెట్టి ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ తీశాడు...ఈ చిత్రం కూడా  మంచి హిట్ కొట్టింది. తల్లీ, కొడుకుల సెంటిమెంట్ ను పూరీ తెరకెక్కించిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించింది.  ఆ తర్వాత వరుస ప్లాపులతో సతమతమవుతున్న పూరీ ప్రిస్టేజియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్ ‘పోకిరి’. ఈ చిత్రం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించింది. 


మహేష్ బాబు లైఫ్ లో మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోయింది.   మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజను ‘చిరుత’గా వెండితెరకు పరిచయం చేసిన ఘనత పూరీజగన్నాథ్ కే దక్కింది. మెగా తనయున్ని ఆడియన్స్ కు రీచ్ చేయడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించాడు పూరీ. ఇలా టాప్ హీరోలు అయిన మహేష్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్, ప్రబాస్ లతో  చిత్రాలు తీశారు.  అయితే ఎన్టీఆర్ తో ‘టెంపర్’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న పూరి..‘జ్యోతిలక్ష్మి, ‘లోఫర్’, ‘ఇజం’, ‘రోగ్’, ‘పైసావసూల్’, ‘మెహబూబా’ వరకు పూరీ తీసిన చిత్రాలన్ని బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. త్వరలో మరో మంచి కథతో ముందుకు రాబోతున్నాడు పూరి జగన్నాధ్.   నేడు పూరి జగన్నాధ్ పుట్టిన రోజు సందర్భంగా ఏపిహెరాల్.కామ్ పుట్టిన రోజులు తెలుపుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: