విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ అవబోతున్న సినిమా నోటా. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేశారు. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ లో జ్ఞానవెల్ రాజా నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 


ఇక ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ న్యూస్ ఈమధ్యనే బయటకు వచ్చింది. ఆనంద్ శంకర్ ఈ సినిమా కథ మొదట అల్లు అర్జున్ కు వినిపించాడట. బన్ని కాదని చెప్పడంతో ఆ ఛాన్స్ విజయ్ దేవరకొండ అందుకున్నాడట. లేటెస్ట్ యువ సంచలనంగా వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు విజయ్ దేవరకొండ.


నోటా టీజర్, ట్రైలర్ చూశాక విజయ్ తమిళంలో ఇలాంటి క్రేజీ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం గొప్ప విషయమే అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా హిట్ అయితే మాత్రం బన్ని ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నట్టే. విజయ్ నటించిన గీతా గోవిందం సినిమా కూడా బన్ని దగ్గర నుండి విజయ్ వద్దకు చేరింది.


ఇక గీతా గోవిందం విజయ్ కెరియర్ లో ఎలాంటి హిట్ కొట్టిందో తెలిసిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం చూస్తే నోటా కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ఒకవేళ నోటా హిట్ అయితే పైకి బన్ని హ్యాపీగా కనిపించినా లోపల మాత్రం చాలా బాధపడతాడని అంటున్నారు. నా పేరు సూర్య తర్వాత బన్ని తన తర్వాత సినిమా ఏంటన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: