ఈ మద్య కొంత మంది హీరోలు తమకు వచ్చిన కథ పక్కన బెట్టి మరో కథతో సినిమా తీయడం..ఆ సినిమా కాస్త అట్టర్ ఫ్లాప్ కావడం..తాము వద్దనుకున్న కథతో తీసిన సినిమా సూపర్ హిట్ కావడం ఎందుకు మిస్సయ్యామా అని తలలు పట్టుకోవడం ఇలా ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు అల్లు అర్జున్, రాంచరణ్, ఎన్టీఆర్, ఇలా ఎంతో మంది స్టార్ హీరోలు తమ కెరీర్ లో ఎప్పుడో ఒకసారి మంచి సినిమాలు మిస్ అయిన వారే.  ఇప్పుడు టాలీవుడ్ లో పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం లాంటి సినిమాలతో స్టార్ హీరో మారాడు విజయ్ దేవరకొండ. 

ప్రస్తుతం తెలుగు, తమిళ వర్షన్ లో ‘నోటా’ సినిమాలో నటిస్తున్నాడు.  వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉన్న విజయ్ దేవరకొండ నటించిన ‘నోటా’ రాజకీయ నేపథ్యంలో వస్తున్న సినిమా కావడంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.  అయితే ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి ఆనంద్ శంకర్ దర్శకుడిగా వ్యవహరించాడు.

ఓ  ఇంటర్వ్యూలో దర్శకులు ఆనంద్ శంకర్ మాట్లాడుతూ..ఆ మద్య అల్లు అర్జున్  ద్విభాషా చిత్రంలో నటించాని అనుకుంటున్నట్లు తెలిసి..ముందు ‘నోటా’ కథ ఆయనకే వినిపించాను.  ఈ కథ విని చాలా బాగుందని..కాకపోతే పాలిటికల్ డ్రామా తనకు అంతగా సెట్ కాదని అన్నారు.  దాంతో ఈ కథ విజయ్ దేవరకొండకు వినిపించానని..కథ చాలా బాగుంది..కానీ అప్పుడే తమిళంలోనా..అంటూ పెదవి విరిచారని..కానీ కథాకథనాల్లోని కొత్తదనాన్ని అర్థం చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెప్పాడు. వసూళ్ల పరంగా ఈ సినిమా సంచలనానికి తెరతీస్తుందేమో చూడాలి.    



మరింత సమాచారం తెలుసుకోండి: