చిరంజీవి పదేళ్ల తరువాత రాజకీయాల నుంచి విరామం ప్రకటించి సినిమాల్లోకి వచ్చాడు. వచ్చిన మొదటి సినిమా తోనే భారీ హిట్ కొట్టి తన క్రేజ్ జోరు ఇంకా తగ్గలేదని నిరూపించుకున్నాడు అయితే చిరంజీవి ఖైదీ 150 సినిమా కు హీరోయిన్స్ సమస్య ఏర్పడింది. ఇప్పడూ కూడా చిరంజీవి కి అదే సమస్య వెంటాడుతుంది.  ఆరు పదుల వయసు దాటిన చిరంజీవితో ఇంకా స్టార్‌ డైరెక్టర్స్‌ సినిమాలు తీయడానికి ఉత్సాహ పడుతున్నారు కానీ ఆయన సరసన సూట్‌ అయ్యే హీరోయిన్లు దొరక్క ఇబ్బంది ఎదురవుతోంది.

Image result for chiranjeevi latest

ఖైదీ నంబర్‌ 150 కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు పరిశీలించి, ఆయనకంటే వయసులో చాలా చిన్నదైన కాజల్‌తో రిస్క్‌ చేసేసారు. ఆ కాంబినేషన్‌లో ఎక్కువ సీన్లు లేకుండా మేనేజ్‌ చేసేసారు. తర్వాత 'సైరా'కి కూడా హీరోయిన్‌ సమస్య వచ్చింది. చివరకు నయనతారని ఓకే చేసారు. సైరా పూర్తయ్యే దశకి రావడంతో చిరంజీవి మలి చిత్రానికి ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ అవుతోంది.

Image result for chiranjeevi latest

కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం డిసెంబర్‌లో మొదలవుతుంది. ఇందులో హీరోయిన్‌ ఎవరనేది ఇంకా డిసైడ్‌ అవలేదు. చరణ్‌తో నటించిన కాజల్‌ని చిరుకి హీరోయిన్‌గా పెట్టినట్టు ఈసారి చరణ్‌తో 'రచ్చ' చేసిన తమన్నాకి ఛాన్స్‌ ఇవ్వవచ్చునని అంటున్నారు. తమన్నా ప్రస్తుతం వెంకటేష్‌ సరసన 'ఎఫ్‌ 2'లో నటిస్తోంది కనుక ఆమె సీనియర్‌ హీరోల సరసకి చేరిపోయినట్టే. సైరాలో తమన్నా కూడా చిన్న పాత్ర పోషిస్తోంది. అయితే తమన్నా సరసన మరీ ఆడ్‌గా కనిపించకూడదంటే మాత్రం చిరంజీవి అర్జంటుగా జిమ్‌ బాట పట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: