‘అరవింద సమేత’ లో రెండు షేడ్స్ ఉండే పాత్రలో జూనియర్ నటిస్తున్న నేపధ్యంలో ఈమూవీలోని జూనియర్ పాత్రకు అనుగుణంగా ఇద్దరు హీరోయిన్స్ ఈమూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ బ్యూటీ పూజా హెగ్డే తో పాటు తెలుగు అమ్మాయి ఇషా రెబ్బా ఈమూవీలో జూనియర్ పక్కన నటిస్తున్నారు. 
Jr NTR
అయితే ఈమూవీలో మూడవ హీరోయిన్ గురించి ఒక సస్పెన్స్ ఉందట. జూనియర్ పక్కన మూడవ హీరోయిన్ గా మరో కన్నడ బ్యూటీ మేఘా శ్రీ నటించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె నటిస్తున్న విషయం ఇప్పటి వరకు అధికారికంగా త్రివిక్రమ్ చెప్పక పోవడంతో మేఘా శ్రీ విషయంలో త్రివిక్రమ్ ఎందుకు సస్పెన్స్ కొనసాగిస్తున్నాడు అన్న విషయమై ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నగా మారింది.  
Aravindha Sametha teaser, Jr NTR
కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో మంచి హీరోయిన్ గా చెప్పుకోతగ్గ పేరు ఈమెకు లేకపోయినా ఈమె ఇప్పటికే తెలుగులో ‘ఓమై గాడ్’ ‘ఖాకీ’ ‘అనగనగా ఒక చిత్రం’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది. అయితే ఈసినిమాలు ఏమీ చెప్పుకోతగ్గ సక్సస్ సాధించలేక పోవడంతో ఈమెకు తెలుగు ప్రేక్షకులలో పెద్ద చెప్పుకో తగ్గ క్రేజ్ లేదు.
NTR's Aravinda Sametha Teaser got thumping response
అయితే ఇప్పుడు ఇలాంటి పెద్దగా పేరులేని హీరోయిన్ ను ‘అరవింద సమేత’ లో మూడవ హీరోయిన్ గా ఎందుకు పెట్టారు అన్న ఆశ్చర్యం చాలామందిలో ఉంది. అయితే ఈమూవీ కథకు సంబంధించి ఒక కీలక పాత్ర కోసం మూడవ హీరోయిన్ కూడ అవసరం అయిన నేపధ్యంలో త్రివిక్రమ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనిఅంటున్నారు. ఈవిషయం పై పూర్తి సస్పెన్స్ తొలిగిపోవాలి అంటే మరి కొద్దిరోజులు ఆగాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: