ప్రబాస్ పరుగు లంగించుకున్నాడు, కనీసం వచ్చే ఏడాదైనా తన పవర్ చూపించాలి అంటూ బాహుబలి బాగా కష్టపడుతున్నాడట. అందుకే ఈ సినిమా నిరవధికంగా ప్రతిరోజు 24 గంటల పాటు షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటోంది.  ఈసినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయి రెండో షెడ్యూల్  మొదలైన సంగతి తెలిసిందే. ఇంత చేసినా 20 శాతం సినిమా నే పూర్తి కావడంతో ఇప్పుడు షూటింగ్ వేగం పెంచారట.

ఈవిషయాన్ని ఈ సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్న రానా తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు. కే.రాఘవేందర్ రావు,శోబాయార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు నిర్మాతలు కాగా బాహుబలికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ప్రభాస్, అనుష్క హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, సుదీప్, రమ్యకృష్ణ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఇంత వేగంగా చిత్రనిర్మాణం జరుగుతున్నా కూడా ఇది 2015లోనే విడుదలవుతుంది అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: