ఈ మాటలు అంటుంది ఎవరో కాదు మెగా హీరో..అల్లువారి అబ్బాయి..స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.  తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోలు చాలా వరకు ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నవారే..అందులో అల్లు అర్జున్ ఒకరు.  తాను ప్రేమించిన స్నేహారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  వీరికి ఇద్దరు పిల్లలు అబ్బాయి పేరు అయాన్..అమ్మాయి పేరు అర్హా.  ఈ మధ్యకాలంలో తమ తమ షూటింగులతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటున్నాడు అల్లు అర్జున్. 

తన ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా..సోషల్ మీడియాలో షేరు చేస్తూ..ఫ్యాన్స్ కి బూస్టింగ్ ఇస్తున్నాడు. నేడు అల్లు అర్జున్ సతీమణి  స్నేహారెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా తన సతీమణికి స్పెషల్‌గా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు బన్నీ. ‘‘హ్యాపీ బర్త్ డే క్యూటీ..’’ అని చెబుతూ ‘ప్రేమతో నా రాణి’ అని పేర్కొన్నాడు.  ఇక అల్లు అర్జున్ ట్విట్ చూసిన తర్వాత ఫ్యాన్స్  స్నేహారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

  షూటింగ్ లో ఉన్నపుడు కాస్త సీరియస్ మేయింటేన్ చేసే అల్లు అర్జున్..ఏ మాత్రం గ్యాప్ వచ్చిన తన భార్య పిల్లలతో ఎక్కువ గా ఎంజాయ్ చేస్తుంటాడు.  విదేశాలకు వెళ్లి వివిధ లోకేషన్స్ లో ఫోటోలు తీసుకొని షేర్ చేస్తుంటాడు. సినీ కెరీర్‌తో పాటుగా తన ఫ్యామిలీ మెంబెర్స్‌కి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తూ.. అందరితో సరదాగా గడపడం ఈ స్టైలిష్ స్టార్ స్టైల్.  విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బన్నీ కొత్త సినిమా రాబోతోందనే టాక్ మాత్రం వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: