ఇప్పుడు ప్రపంచలో అన్నింటా పురుషులతో మహిళలు సమానంగా ముందుకు సాగుతున్నారు.  విద్యా, ఉద్యోగ,రాజకీయ,శాస్త్ర సాంకేతిక రంగంలో..అన్నింటా పురుషులతో సమానంగా మహిళలు సత్తా చాటుతున్నారు.  అయితే భారత దేశంలో ఆర్థికంగా ఒక కుటుంబం మంచి స్థాయిలో ఉండాలంటే..భార్యా భర్తలు ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.  ఆ సమయంలో ఆ కుటుంబంలో పెద్దలు ఉంటే ఒకే..లేదంటే పిల్లల సంరక్షణ కేంద్రంలో ఉంచి వెళ్తుంటారు.  సాయంత్రం మళ్లీ తమ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లడం తెలిసిన విషయమే. 

కొంత మంది తమ ఇంట్లోనే పిల్లలను చూసుకోవడానికి ఆయాలను ఏర్పాటు చేసుకొని మంచి జీతం ఇస్తుంటారు. తాజాగా బాలీవుడ్ స్టార్ క‌పుల్ సైఫ్ అలీఖాన్‌, క‌రీనా క‌పూర్‌ల గారాల త‌న‌యుడు తైమూర్ అలీఖాన్  అందరికీ తెలిసిందే..ఈ బుడ్బోడు పుట్టినప్పటి నుంచే సోషల్ మీడియాలో హడావుడి చేస్తున్నాడు.   తైమూర్ ఫోటోలు, హెయిర్ స్టైల్‌, ధ‌రించే బ‌ట్ట‌లు గురించి బాలీవుడ్ అభిమానులు ఆస‌క్తిక‌రంగా చ‌ర్చించుకుంటుంటారు. ఇక క‌రీనా, సైఫ్  మంచి ఫామ్ లో ఉన్న నటులు కనుక షూటింగ్‌ల‌కు వెళ్లాల్సి ఉండ‌డంతో తైమూర్‌కు సంర‌క్ష‌కురాలిగా ఓ మ‌హిళ‌ను నియ‌మించారు.

తైమూర్‌కు సంబంధించిన ప‌నుల‌న్నింటినీ ఆమే చూసుకుంటుంద‌ట‌.  ఇక ఆ ఆయా జీతం గురించి తెలిస్తే..కాస్త షాక్ తినాల్సిదే. ఒక్క నెల‌కు ఆమె అందుకునే జీతం 1.5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ట‌. నిర్దేశించిన స‌మయం కంటే ఎక్కువ ఉండాల్సి వ‌స్తే మ‌రో పాతిక వేల రూపాయ‌లు అద‌నంగా ఇస్తుంద‌ట ప‌టౌడీ కుటుంబం.  అందే కాదు ఆమె కోసం ఓ ప్రత్యేక కారు కూడా ఏర్పాటు చేశారట..ఎప్పుడైనా విదేశాల్లో షూటింగ్ ఉంటే..ఆమెను కూడా వెంట తీసుకు వెళ్తారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: