ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ కాలాం నడుస్తుంది.  ఆ ట్రెండ్ లో స్పోర్ట్స్ పర్సన్స్ జీవిత కథలు మరింతగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అదే కోవలో తెరకెక్కుతున్న చిత్రం సైనా నెహ్వాల్ బయోపిక్. బ్యాడ్మింటన్ ఛాంపియన్ అయిన సైనా నెహ్వాల్ బయోపిక్ అమోల్ గుప్తే దర్శకత్వంలో తెరకెక్కుతుండగా టీ—సీరీస్ వారు నిర్మిస్తున్నారు. ఇక సైనా నెహ్వాల్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 22 న ప్రారంభం అయింది. ఈ సినిమా వైపు ప్రేక్షకుల దృష్టిని మళ్లించడానికి శ్రద్ధా కపూర్ ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.


బ్యాడ్మింటన్ రాకెట్ పట్టుకుని విజయాన్ని ఆస్వాదిస్తున్న సైనా లుక్‌లో శ్రద్ధా కపూర్ అదిరిపోయింది. అచ్చం సైనాలానే కనిపిస్తోంది.  ఈ సినిమా కోసం శ్రద్దా కపూర్ కొంత కాలంగా సైనా నెహ్వాల్ ఇంట్లో ఉంటూ..ఆమె అభిరుచులు..ఆట తీరు..మొత్తం స్వయంగా అనుభవంతో నేర్చుకుంది. ఇక స్పోర్ట్స్ జెర్సీ.. హెయిర్ బ్యాండ్.. మేకప్ లేకుండా పూర్తిగా సైనాలా గా మారింది. కరెక్ట్ గా చూస్తే శ్రద్ధ.. సైనాలలో  డిఫరెన్స్ కనుక్కోవడం కష్టం అన్నంతగా మరిపోయింది.  గత కొద్ది నెలలుగా బ్యాడ్మింటన్ క్రీడను నేర్చుకుంటోంది. 2010 కామన్వెల్త్ క్రీడల్లో సైనా నెహ్వాల్ బంగారు పతకం సాధించింది. అలాగే 2012 ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. అంతేకాదు, ప్రపంచ నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఏకైక భారత మహిళా బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా.


2015లో ఈ ఘనత సాధించింది. ఓ ఇంటర్వ్యూలో శ్రద్దా కపూర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం 40 బాడ్మింటన్ క్లాసెస్ లో పాల్గొన్నానని..  పొద్దున్నే ఆరుగంటలకు పాల్గొనే సెషన్స్ కూడా ఉన్నాయని.. ఆ ప్రాక్టిస్ సెషన్స్ కష్టం అయినా ఎంజాయ్ చేశానని చెబుతోంది.  ఒక స్పోర్ట్స్ పెర్సన్ పాత్ర పోషించడం ఎంతో ఛాలెంజ్ తో కూడుకున్నదని అందులో సైనా ప్రయాణం చాలా ఇంట్రెస్టింగ్ అని తెలిపింది. కాగా, సైనా పాత్ర కోసం పుల్లెల గోపీచంద్ వద్దే శ్రద్ధా కపూర్ బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: