విశాల్ పందెం కోడి 2 సినిమా వస్తున్న సంగతీ తెలిసిందే.అయితే పందెం కోడి మొదటి పార్ట్ ను ఎవరు అంత తేలిగ్గా మరిచిపోరు. పులిని చూసి భయపడ్డానికి పొట్టేలు అనుకున్నావా? పులివెందుల బిడ్డను రా..'' ఇదీ డైలాగు విశాల్ పందెంకోడి 2 సినిమా ట్రయిలర్ లో. మరి డైలాగ్ ఇలా వుంటే ట్రయిలర్ ఎలా వుంటుంది? ఎలా వుండాలి? ఈ రోజు విడుదల అయిన ట్రయిలర్ అలాగే వుంది. పక్కా మాస్ మసాలా ఎంటర్ టైనర్ మాదిరిగా.

Image result for pandem kodi 2 poster

పందెంకోడి సినిమాను తెలుగు జనాలు అంత సులువుగా మరిచిపోలేరు. అటు విశాల్ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ, ఇటు మీరా జాస్మిన్ అల్లరి నటన కానీ ఇప్పటికీ జనాలకు ముచ్చటే. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తోంది అంటే కాస్త ఆసక్తికరమే. కానీ అదే సమయంలో చిన్న అనుమానం. మీరాజాస్మిన్ ను రీప్లేస్ చేయగల నటి ఎవరు? పందెంకోడి సీక్వెల్ కు సరైన కథ సెట్ అవుతుందా? అని.

Image result for pandem kodi 2 poster

సీక్వెల్ ట్రయిలర్ చూస్తుంటే, ఈ రెండు సమస్యలను అధిగమించినట్లే కనిపిస్తోంది. కీర్తి సురేష్ కూడా వీలయినంత అల్లరిగా నటించినట్లు కనిపిస్తోంది. ఇక యాక్షన్ సీక్వెన్స్ లు అన్నీ భారీగా వున్నాయి. అయినా ఇంకా మరో రెండు వ్యవహారాలు క్వశ్చను మార్కుల్లా వుండనే వున్నాయి. పార్ట్ వన్ లో యాక్షన్ సీన్లు, ఫ్యామిలీ సీన్లు పడుగు పేకల్లా సమానంగా అల్లుకుని వుంటాయి. కానీ ఈ ట్రయిలర్ లో అలాంటి ఛాయలు కనిపించలేదు. అలాగే పార్ట్ వన్ లో బలమైన విలనిజం వుంటుంది. ఇక్కడ వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్. మరి ఎలా వుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: