బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఈరోజు ఫైనల్స్ జరుగబోతున్నాయి. ఇప్పటికే ఆ ఎపిసోడ్ పూర్తయింది. కౌశల్, గీతా మాధురి, తనీష్, సామ్రాట్, దీప్తి నల్లమోతు ఫైనల్ కంటెస్టంట్స్ కాగా వారిలో కౌశల్ ఫైనల్ విన్నర్ అయ్యాడని అంటున్నారు. షో మొదటి నుండి తన ప్రత్యేకమైన ఆటని ప్రదర్శిస్తూ హౌజ్ లో ఎలాంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేసుకుంటూ వచ్చిన కౌశల్ విన్నర్ అవడం అందరికి సబబే.


ఇక ఫైనల్ విన్నర్ తేల్చే ఓటింగ్స్ లో భాగంగా కొన్ని మీడియా సంస్థలు నిర్వహించిన ఓట్లలో కౌశల్ కు ఏకంగా 15 కోట్లు వచ్చాయని అంటుండగా కాదు కాదు 35 కోట్ల దాకా కౌశల్ ఓట్లు సంపాదించాడని అంటున్నారు. దాదాపుగా 75 శాతం ఓట్లు కౌశల్ కు సపోర్ట్ గా పడ్డాయంటే ప్రేక్షకుల్లో కౌశల్ స్టామినా ఏ రేంజ్ లో ఉందో ప్రూవ్ అయ్యింది.


మొదటి నుండి తన మీద నెగటివ్ ఇంప్రెషన్ తో ఉన్న హౌజ్ మెట్స్ ప్రతి టాస్కులో కౌశల్ ను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇక బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ అతిథిగా వచ్చిన వెంకటేష్ చేతుల మీదగా టైటిల్ అందుకున్నాడట. బిగ్ బాస్ చరిత్రలోనే ఇన్ని కోట్ల ఓటింగ్స్ రావడం అది కూడా తెలుగు ప్రేక్షకులు వేయడం విశేషంగా చెప్పుకుంటున్నారు.


కౌశల్ క్రేజ్.. ఫాలోయింగ్ చూసి హౌజ్ నుండి ఎలిమినేట్ అయిన మిగతా ఇంటి సభ్యులంతా అవాక్కయ్యారని తెలుస్తుంది. ఫైనల్ గా 110 రోజుల బిగ్ బాస్ ఫైట్ లో కౌశల్ రియల్ హీరోగా విజేతగా నిలిచాడు. కౌశల్ విజేతగా నిలవడంలో కౌశల్ ఆర్మీ ప్రభావం బాగా ఉంది. అంతేకాదు బిగ్ బాస్ ఫాలో అయ్యే సగటు ప్రేక్షకులు కూడా కౌశల్ కు ఓటేసినట్టు తెలుస్తుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: