'గీత గోవిందం' విడుదలకు ముందు ఆసినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ ఇంటర్నెట్ లో లీక్ అవ్వడంతో అప్పట్లో జరిగిన కలకలం ఆసినిమా నిర్మాత అల్లు అరవింద్ ను కూడ షేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ లీక్ వ్యవహారం జరిగిన కొన్ని గంటలకే ఈవ్యవహారానికి సంబంధించి పలువురు ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను సైతం అరెస్టు చేయడం అప్పట్లో హాట్ టాపిక్. 
‘టాక్సీవాలా' రిలీజ్ ఎప్పుడు?
ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ మరో లేటెస్ట్ సినిమా ‘టాక్సీ వాలా’ సినిమాను చూస్తూ కొందరు యువకులు పట్టుబడటం మరో సంచలన వార్తగా మారింది. తెలుస్తున్న సమాచారం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో కొందరు యువకులు మొబైల్ ఫోన్లలో 'టాక్సీవాలా' చూస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
వీరికి మొబైల్‌లోకి సినిమా ఎలా వచ్చింది?
వారి వద్ద నుండి మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకుని ఈకేసును సైబర్ ఇన్వెస్టిగేషన్‌కు పంపినట్లు తెలుస్తోంది. దీనితో ఇంకా విడుదలకాని ‘టాక్సీవాలా' సినిమా వీరి మొబైల్‌లోకి ఎలా వచ్చింది? అన్న కోణంలో విచారణ జరుగుతోంది. దీనికితోడు ఈ సినిమాను తమ సెల్ ఫోన్ లలో చూసిన యువకులకు ఎవరెవరితో వారికి సంబంధాలు ఉన్నాయి అనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
పోలీసుల అదుపులో యువకులు
టాలీవుడ్ అగ్ర‌నిర్మాణ‌ సంస్థ‌లు గీత ఆర్ట్స్ 2 యువి పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. వాస్తవానికి ‘గీత గోవిందం’ సినిమా కన్నా ముందుగా ఈమూవీ విడుదల కావలసి ఉన్నా ఈమూవీ విషయంలో అల్లు అరవింద్ కు కొన్ని సందేహాలు ఉండటంతో ఈమూవీ రీ షూట్ జరిగినట్లు టాక్. రాహుల్ సంకృత్యాన్ అనే కొత్త దర్శకుడు ఈమూవీ ద్వారా పరిచయం కాబోతున్నాడు. వచ్చే వారం విడుదల కాబోతున్న ‘నోటా’ రిజల్ట్ బట్టి ఇదే సంవత్సరం ‘టాక్సీ వాలా’ కూడ విడుదల అయ్యే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: