113 రోజుల ప్రయాణం.. పోటీగా 17 మంది కంటెస్టంట్లు.. అడుగు పెట్టేప్పుడు ఏదైతే అనుకున్నాడో అదే సాధించి వెళ్తున్నాడు కౌశల్ మండా. ఒక టివి షో ద్వాతా మ్యాక్సిమం ఎంత మంది అభిమానులను సంపాదించవచ్చో కౌశల్ ను చూస్తే తెలుస్తుంది. తను గెలుచుకున్న అవార్డ్ కన్నా కౌశల్ ఆర్మీనే అతనికి మరింత బలాన్ని ఆనందాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు.


ఇంటి సభ్యులంతా ఒకవైపు తానొక వైపు ఉండి ఆటని రసవత్తరంగా సాగిస్తూ తాను గెలవాల్సిన ప్రేక్షకుల హృదయాలను గెలిచాడు కౌశల్. అసలు ఈ సీజన్ లో కౌశల్ అనేవాడు లేకుంటే గొడవలే ఉండేవి కావు. ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెట్టాడో అప్పుడో తన అన్ని ఎమోషన్స్ పక్కన పెట్టి గేం ను గేం లా ఆడుతూ వచ్చాడు కౌశల్.


అదే అతన్ని కోట్ల మంది ప్రేక్షకులకు దగ్గరయ్యేలా చేసింది. కేవలం కౌశల్ ఆర్మీ మెంబర్స్ మాత్రమే కాదు కౌశల్ గెలవడానికి వేసిన ఓట్లలో బిగ్ బాస్ ఫాలోవర్స్ కూడా ఉన్నారంటే ఇక ఆ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. బిగ్ బాస్ విన్నర్ గా కౌశల్ 50 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. అయితే కాన్సర్ కారణంగా తన తల్లి చనిపోవడంతో ఇక మీదట ఏ తల్లి అలా చనిపోకూడదని తన వంతు సాయంగా ఇది అందిస్తానని అన్నాడు కౌశల్.
ఇంటి సభ్యులతో మొరటోడిగా ప్రవర్తించిన కౌశల్ కేవలం 50 లక్షల కోసం ఇన్ని నాటకాలాడాలా అనుకున్నారు తోటి కంటెస్టంట్స్. కాని వచ్చిన మొత్తాన్ని సేవా దృక్పథంతో ఇచ్చేయడానికి సిద్ధమయ్యాడంటే కౌశల్ నిజంగా గొప్ప మనసు కలవాడని చెప్పొచ్చు. మొత్తానికి బిగ్ బాస్ సెకండ్ సీజన్ ఊహించని ఎన్నో పరిణామాలతో ముగిసింది. ఫైనల్ గా కోట్ల మంది ప్రేక్షకుల మెప్పుతో కౌశల్ మండా బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ అయ్యాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: