ఈరోజుతో అక్టోబర్ మొదలుకావడంతో జూనియర్ అభిమానుల ఆశలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. రేపు ‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరగబోతున్న నేపధ్యంలో ఈమూవీకి మరింత హైక్ ఈఫంక్షన్ తరువాత వస్తుందని ఈమూవీ నిర్మాతలు ఆశిస్తున్నారు. అయితే ఆశ్చర్యకరంగా మన తెలుగురాష్ట్రాలలో ఈవారం విడుదలకాబోతున్న ‘నోటా’ గురించి మాట్లాడుకుంటున్న స్థాయిలో సాధారణ ప్రేక్షకులు ‘అరవింద సమేత’ గురించి పెద్దగా మాట్లాడుకోకపోవడం చాలమందిని ఆశ్చర్య పరుస్తోంది. 
Jr NTR in Aravinda Sametha
వాస్తవానికి ‘అరవింద సమేత’ క్రియేట్ చేయబోయే రికార్డులు జూనియర్ కు చాల అవసరం. ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 75కోట్ల నెట్ కలక్షన్స్ మార్క్ ను రెండు సార్లు మహేష్ ప్రభాస్ లు అధికమించారు. 9సంవత్సరాల గ్యాప్ తో తిరిగి సినిమాలలో నటించిన చిరంజీవి కూడ తన ‘ఖైదీ నెంబర్ 150’ 75 కోట్ల నెట్ కలక్షన్స్ మార్క్ ను అందుకున్నాడు. 
Aravinda Sametha photo leaked Jr NTR bonding with Naga Babu
ఇక రామ్ చరణ్ అయితే ఈఏడాది విడుదలైన ‘రంగస్థలం’ తో ఇక ఎవరి ఊహలకు అందకుండా ‘గీత గోవిందం’ సంచలనంతో విజయ్ దేవరకొండ ఇప్పటికే తమ 75 కోట్ల నెట్ కలక్షన్స్ మైల్ స్టన్ ను అందుకోవడంతో ఇప్పుడు ఆ ఫీట్ జూనియర్ రిపీట్ చేయగలడా అన్నఅంచనాల ఒత్తిడి జూనియర్ పై విపరీతంగా పెరిగిపోతోంది. దీనితో టాప్ హీరోల రేస్ లో తన స్థాయిని పదిల పరుచుకోవాలి అంటే ‘అరవింద సమేత’ ఎట్టి పరిస్థుతులలో 75 కోట్ల నెట్ రేంజ్ ని అందుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. 
Aravinda Sametha Veera Raghava Teaser
వాస్తవానికి ఈ 75కోట్ల టార్గెట్ ను అల్లు అర్జున్ అందుకోలేకపోయినా బన్నీ గురించి ప్రస్తుతం పెద్దగా ఎవరు మాట్లాడటం లేదు. దీనితో 75 కోట్ల టార్గెట్ అంతా జూనియర్ భుజాల పై పడింది. అయితే సినిమా టాక్ తో సంబంధం లేకుండా తన సినిమాల కలక్షన్స్ ను నిలుపుకునే స్థాయి జూనియర్ కు లేదు. దీనికితోడు జూనియర్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసే వ్యక్తులు కూడ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘అరవింద సమేత’ తన 75 కోట్ల నెట్ కలక్షన్స్ టార్గెట్ మిస్ అయితే తిరిగి 2020 వరకు జూనియర్ నుండి సినిమా వచ్చే ఆస్కారం లేదు. రాజమౌళి మల్టీ స్టారర్ లో జూనియర్ నటిస్తున్న నేపధ్యంలో చాల పెద్ద గ్యాప్ ఏర్పడబోతోంది. దీనితో ‘అరవింద సమేత’ ఒక విధంగా జూనియర్ కెరియర్ కు సంబంధించి ఒక అగ్ని పరిక్షలా మారింది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: