రాజీవ్ కనకాల నటుడుగా పెద్దగా రాణించకపోయినా అతడి భార్య సుమతో కలిసి ఇప్పటికే ఒక ప్రొడక్షన్ హౌస్ ను ఏర్పాటు చేసి చాల బుల్లితెర షోలకు సంబంధించిన కంటెంట్ నిర్మాణం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో రాజీవ్ కనకాల డిస్ట్రిబ్యూటర్ గా మారి చేస్తున్న సాహసం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 
Ram-Charan
తెలుస్తున్న సమాచరం మేరకు రాజీవ్ కనకాల మహర్షి రాఘవతో కలిసి చరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ మూవీ ఓవర్సీస్ రైట్స్ ను ఒక భారీ మొత్తానికి కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘రంగస్థలం’ తరువాత చరణ్ సినిమాలకు ఓవర్సీస్ లో విపరీతమైన మార్కెట్ పెరిగిపోయిన నేపధ్యంలో రాజీవ్ కనకాల ఈసాహాసం చేసినట్లు టాక్. 
Regular Shooting of Ram Charan-Boyapati Srinu's Next Begins
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో నిర్మింపబడుతున్న ఈసినిమాకు ఒకనాటి చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ‘స్టేట్ రౌడీ’ టైటిల్ ను యధాతధంగా పెట్టబోతున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది మొదట్లోరాబోతున్న సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ఈమూవీ విడుదలవుతున్నా ఏకంగా ఎన్టీఆర్ బయోపిక్ తో ఈమూవీ పోటీ పడటం సంచలనంగా మారింది. 
Ram Charan and Boyapati Film shooting in Rajasthan
ఇలాంటి భారీ పోటీ మధ్య విడుదల కాబోతున్న భారీ సినిమాను అత్యంత భారీ మొత్తానికి రాజీవ్ కనకాల కొనడం అత్యంత సాహసం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. బుల్లితెర పై కూడ పోటీ విపరీతంగా పెరిగిన నేపధ్యంలో యాంకర్ సుమ తన వయస్సు రీత్యా మరి కొంతకాలమే యాంకర్ గా కొనసాగే ఆస్కారం ఉంది. ఇలాంటి పరిస్థుతులలో సుమ తనభర్త రాజీవ్ సపోర్ట్ తో బిజినెస్ ఉమెన్ గా మారబోతోంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: