తెలుగు లో 113 రోజుల పాటు ఎంతో సందడిగా కొనసాగిన బిగ్ బాస్ సీజన్ 2 ఆదివారం ముగిసింది.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విక్టరీ వెంకటేష్ రాగా బిగ్ బాస్ 2 సీజన్ విన్నర్ గా కౌశల్ ని ప్రకటించారు.  వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ ని అందుకున్నాడు కౌశల్. గతంలో బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ గా శివబాలాజీ గెలుపొందిన విషయం తెలిసిందే.  అయితే ఈ సారి బిగ్ బాస్ లో పదిహేడు మంది కంటిస్టెంట్లు రాగా అందులో ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు. 

గణేష్, నూతన్ నాయుడు, సంజన లు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు.  వీరిలో సంజన మొదటి వారం ఎలిమినేట్ కాగా, నూతన్ నాయుడు రెండు పర్యాయాలు బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.  ఇక గణేష్ దాదాపు డెబ్బై రోజుల పాటు బిగ్ బాస్ హౌజ్ లో కొనసాగాడు. వంద రోజుల పాటు బిగ్ బాస్ లో సందడి చేసి చివరిగా ఐదుగురు మాత్రమే మిగిలారు.  కౌశల్, తనిష్, గీతా మాధురి, సామ్రాట్, దీప్తి.  నిన్న ఫైనల్ లో సామ్రాట్, దీప్తి, తనిష్ లు ఎలిమినేట్ కాగా కౌశల్, గీతామాధురి పోటీలో నిలిచారు. 

వారిలో కౌశల్ విన్నర్ గా ప్రకటించారు నాని.  విజేతగా నిలిచిన కౌశల్‌కు టాలీవుడ్ నటుడు వెంకటేశ్ అవార్డుతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతిని అందించారు. ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ..  ఈ ప్రైజ్ మని కేన్సర్ బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తన తల్లి క్యాన్సర్ తో మరణించారని..అలాంటి బాధ ఎవరూ పడకూడదని తన వంతు సహాయంగా ఈ విరాళం ప్రకటిస్తున్నట్లు తెలిపారు.  రూ.50 లక్షల ప్రైజ్ మనీని కేన్సర్ బాధిత మహిళల కోసం వినియోగిస్తానని ప్రేక్షకులు, ఆహూతుల హర్షధ్వానాల మధ్య ప్రకటించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: