మహా భారతంలో అర్జునుడికి సవ్యసాచి అని పేరు ఉంది. అర్జునుడు తన రెండు చేతులతోనూ బాణాలను సంధించగలడు అందుకే ఆయనను సవ్యసాచి అంటారు. ఇంతటి పవర్ ఫుల్ నేమ్‌ను చందు మొండేటి తన మూవీ టైటిల్‌గా ఫిక్స్ చేశారు.  అక్కినేని నాగా చైతన్య నటిస్తున్న ఈ సినిమాకు ఆ పేరు ఎందుకు పెట్టారో సినిమా చూస్తే అర్థం అవుతుందని మొదటి నుంచి చెప్పకుంటూ వస్తున్నారు.  రీసెంట్ గా మారుతి దర్శకత్వంలో నాగ చైతన్య, అను ఇమ్మాన్యుయెల్ జంటగా నటించిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది.  వసూళ్ల పరంగా కూడా మంచి కలెక్షన్లు సాధించింది.   


చందూ మొండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న ‘సవ్యసాచి’ అప్ డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.   అక్కినేని అభిమానులు ఎంతగానే ఎదురుచూస్తున్న ‘సవ్యసాచి’ టీజర్ కొద్దీ సేపటి క్రితం విడుదలైయింది. ఇక ఈటీజర్ చూస్తుంటే చైతు రొటీన్ కు బిన్నంగా అదిరిపోయి కాన్సెప్ట్ తో రానున్నాడని తెలుస్తుంది. తన మొదటి సినిమా ‘కార్తికేయ’ సినిమాతో ఇండస్ర్టీ ద్రుష్టి ని తన వైపు తిప్పుకున్న దర్శకుడు చైతు మొండేటి ఈ చిత్రాన్ని కూడా డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నాడు.


ఇక టీజర్ విషయానికి వస్తే..‘మామూలుగా ఒక తల్లి రక్తం పంచుకుని పుడితే.. అన్నదమ్ములంటారు. అదే ఒకే రక్తం ఒకే శరీరం పంచుకుని పుడితే అది అద్భుతం అంటారు’ అంటూ నాగ చైతన్య చెప్పే వాయిస్‌ ఓవర్‌తో సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అర్థం అవుతుంది.   ‘కనిపించని అన్నని.. కడదాకా ఉండే కవచాన్ని..  ఈ సవ్యసాచిలో సగాన్ని’ అంటూ చైతు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. వాయిస్ ఓవర్‌ని బట్టి చూస్తే పైకి కనిపించని.. ఒకే శరీరంతో ఉన్న కవలల కథ ఆధారంగా ఈ సినిమా రూపొందినట్టుగా తెలుస్తోంది.


ఇక ఈ సినిమాలో మాధవన్ పాత్ర కూడా మరో హైలైట్ కానుంది. ఆయన ఈచిత్రంలో ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా కీలక పాత్రలో కనిపించనుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈచిత్రం నవంబర్ 2న విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: