బాలీవుడ్ లో నటుడు,దర్శకుడు, నిర్మాత, రచయితగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన మహానటులు రాజ్ కపూర్ అంటే తెలియని వారు ఉండరు.  ఆయన ఎంతో మంది నటీ, నటులకు ఇండస్ట్రీకి పరిచయం చేశారు.  రొమాంటిక్ చిత్రాలు తీయడంలో ఆయనకు మించిన వారు లేరని అంటారు.  తాజాగా బాలీవుడ్ నటుడు సతీమణి  కృష్ణ రాజ్‌ కపూర్‌ (87) సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందినట్లు ఆమె పెద్ద రణదీర్‌ కపూర్‌ తెలిపారు.  గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటు కారణంగా మరణించారు.


ఈ విషయాన్ని రాజ్ కపూర్ పెద్ద కుమారుడు రన్ దీర్ కపూర్ మీడియాకు తెలిపారు.  రాజ్‌కపూర్‌ 1946లో కృష్ణరాజ్‌కపూర్‌ను పెళ్లి చేసుకున్నారు. వారికి ఐదుగురు సంతానం. వారిలో ముగ్గురు కుమారులు కాగా, ఇద్దరు కుమార్తెలు. రణదీర్‌ కపూర్‌, రిషి కపూర్‌, రాజీవ్‌ కపూర్‌, కుమార్తెలు రీతూ, రీమాలు.  ఇండస్ట్రీకి బాలనటుడిగా రణదీర్ కపూర్, రిషి కపూర్ లు ఎంట్రీ ఇచ్చారు.  తర్వాత హీరోలుగా రాణించారు.  ప్రస్తుతం బాలీవుడ్ లో రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. 


ఇక రిషీకపూర్ తనయుడు రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్నాడు.  ఈ ఉదయాన్నే నా తల్లిని కోల్పోయాను, ఆమె ప్రశాంతంగా కన్నమూసారంటూ రణధీర్‌ కపూర్‌ ట్వీట్‌ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా నాన్నమ్మకు సంతాపం తెలుపుతూ లవ్‌ యూ ఆల్‌వేస్‌..దాది అని పోస్ట్‌ చేశారు. కాగా, కృష్ణ కపూర్‌ మరణంపై చలన చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: