‘బిగ్ బాస్ 2’ హడావిడి ముగియడంతో ఇప్పుడు నాని తానూ లేటెస్ట్ గా నాటించబోయే ‘జెర్సీ’ సినిమా పై దృష్టి పెట్టాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ షూటింగ్ దసరా నుండి ప్రారంభం అవుతుంది అని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తమిళంలో రెడీ అవుతున్న సినిమా ‘96’ ను నాని ఈ మధ్య దిల్ రాజ్ తో కలిసి ప్రత్యేకంగా చూడటంతో ఈమూవీలో నాని నటిస్తున్నాడు అంటూ వార్తల హడావిడి జరిగింది. 
Nani Wallpapers Free Download
అయితే  బయట పడుతున్న అసలు ట్విస్ట్ ప్రకారం నాని ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజ్ తో కలిసి నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు టాక్ ‘96’ సినిమా ఫీల్ గుడ్ మూవీ అయినప్పటికీ ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలి అంటే ఈ మూవీ స్క్రీన్ ప్లే విషయంలో చాలా మార్పులు చేయాలి అని నాని దిల్ రాజ్ కు సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Allu Arjun Photos
అంతేకాదు ఈమూవీకి తగిన డైరక్టర్ హీరో సెట్ కావాలి అన్న అభిప్రాయంలో నాని ఉన్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా ఈసినిమా రీమేక్ కు సంబంధించి అందుతున్న సమాచారం మేరకు నిన్న రాత్రి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమాను చూసాడు అని వార్తలు వస్తున్నాయి . 
Dil Raju. YouTube
ఈమూవీ నిర్మించే ఆలోచనలో ఉన్న దిల్ రాజ్ కోరిక మేరకు ఈమూవీని అల్లు అర్జున్ చూసినట్లు సమాచారం. దీనితో ఈ సినిమా విషయంలో బాగా ఆసక్తి ప్రదర్శిస్తున్న నాని అల్లు అర్జున్ అభిప్రాయం గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ వరసలో ‘96’ సినిమాను ఇంకా ఎంతమంది చూస్తారు అసలు ఈ ప్రాజెక్ట్ విషయంలో నాని ఆసక్తి ఎంత వరకు ఉంది అన్న కోణంలో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: