‘బిగ్ బాస్ 2’ విజేతగా కౌశల్ ను ప్రకటించి ఒకరోజు కూడ పూర్తి కాకుండానే ఈఎంపిక పై అనేక వివాదాదాలు చుట్టుముడుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు కౌశల్ కు 39కోట్ల ఓట్లు వచ్చినట్లుగా లీకులు అందుతున్నాయి. అయితే వినడానికి కూడ ఆశ్చర్యంగా ఉన్న ఈఓట్లు సంఖ్య పై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ‘బిగ్ బాస్ 2’ కంటెస్టెంట్ హేతువాది బాబు గోగినేని కౌశల్ ఎంపిక పై కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసాడు. 
 వారం పట్టింది
‘బిగ్ బాస్ 2’ పై తనకు పూర్తి విరక్తి కలిగిందని బాబు గోగినేని కామెంట్ చేస్తూ  3,500 డాలర్లకు అమెరికా నుండి కొన్ని పదుల వేల జీమెయిల్ ఖాతాలను కొనుక్కోవచ్చని ఆ ఫీజు కడితే అమెరికాలోని ఆ మార్కెటింగ్ సంస్థ వారే ఆ ఈమెయిల్ ఖాతాల నుంచి వోట్లు వేసి పెడతారనీ తాజాగా తనవద్ద సమాచారం ఉంది అంటూ బాబు గోగినేని సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

గార్డెన్‌లో నడుస్తూనే

క్రికెట్ భాషలో చెప్పాలంటే ఆట బుకీస్ చేతిలోకి వెళ్లిపోయినట్లుగా రియాలిటీ షోగా ఉండాల్సిన ‘బిగ్ బాస్’ షో సైబర్ వార్‌ గా మారిపోయింది అంటూ బాబు గోగినేని చేసిన కామెంట్స్ పెను సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా కౌశల్‌ కు దాదాపు 39 కోట్ల ఓట్లు రావడం వెనుక ఒక స్ట్రాటజీ నడిచిందని ప్రచారం జరుగుతోంది. కౌశల్ కు కేవలం తెలుగు బుల్లితెర ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా మళయాళ తమిళ బుల్లితెర ప్రేక్షకులు కౌశల్ కు ఓట్లు వేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. 

బాబుగారు ఆ మాట అన్నారు
బిగ్ బాస్ 2 తెలుగులో కౌశల్‌ విజేతగా నిలవగా... తమిళం బిగ్ బాస్2లో రిత్విక, మలయాళం బిగ్‌బాస్‌లో సబుమన్ విన్ అయ్యారు. తెలుగులో కౌశల్ ఆర్మీ ఏర్పడ్డట్లే మలయాళంలో సబు ఆర్మీ, తమిళంలో రిత్వికా ఆర్మీ ఏర్పడాయి. ఈ ఆర్మీల మద్దతుతోనే మూడు భాషాల్లో బిగ్ బాస్ విజేతలు నిర్ణయించబడ్డారు. కౌశల్‌కు భారీగా ఓటింగ్ జరిగేలా మద్దతు కూడగట్టడంలో కౌశల్ ఆర్మీ చేసిన ఆపరేషన్స్ సక్సెస్ అయ్యాయి. బిగ్‌బాస్ షో ప్రారంభం అయిన తర్వాత చిన్నగా మొదలైన కౌశల్ ఆర్మీ వారాలు గడుస్తున్న కొద్దీ క్రమక్రమంగా పెరుగుతూ తమిళం, మలయాళం బుల్లితెర ప్రక్షకుల నుండి కూడా కౌశల్‌కు సపోర్టుగా ఓట్లు వేయించడంతో పాటు కౌశల్ ఆర్మీ  తమిళంలో రిత్విక కు మలయాళంలో సబు ఆర్మీకి ఒకరికొకరు ఒకరికొకరు సహాయంచేసుకుంటూ నడిపిన ఈ ఓట్ల రాజకీయం బుల్లితెర బిగ్ బాస్ షో నిర్వాకులకే మైండ్ బ్లాంక్ చేసిందని సమాచారం..  



మరింత సమాచారం తెలుసుకోండి: