తెలుగు ఇండస్ట్రీలో ఈ మద్య మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువగా వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో అక్కినేని నాగార్జున, నాని నటించిన 'దేవదాస్‌'  మిశ్రమ స్పందన్న వచ్చినా..ఈ వారంలో చెప్పుకోదగ్గ చిత్రాలు ఏవీ లేకపోవడంతో కలెక్షన్ల పరంగా దూసుకు వెళ్తుంది.  ఈ మద్య చాలా చిత్రాలు లెన్తీగా ఉండటం వల్ల కొన్ని సీన్లు డిలీట్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఆ మద్య మహానటి చిత్రంలో పలు ముఖ్యమైన సన్నివేశాలు తీసేయాల్సిన పరిస్థితి రావడం..తర్వాత ఒక్కొ డీలీట్ సీన్లు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. 

తాజాగా అక్కినేని నాగార్జున, నాని నటించిన 'దేవదాస్‌' చిత్రంలోని డిలీట్ చేసిన ఓ సీన్ ను నాని తన అభిమానులతో పంచుకున్నాడు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో జరుగుతున్న మోసాల నేపథ్యంలో ఈ సన్నివేశాన్ని తెరకెక్కించగా, రావు రమేశ్ తో వాదనకు దిగే సీన్ ఇది. ఈ స‌న్నివేశం అభిమానులు ఆక‌ట్టుకునేలా ఉంది.  "నేను బయట ఎన్ని కేసులు డీల్‌ చేశానో తెలుసా?" అంటూ ప్రారంభమయ్యే నాని డైలాగుల్లో, పేపర్‌ తో గొంతుకోయొచ్చని తెలుసా? ఈ చేతులతో ఎన్ని బుల్లెట్లు తీశానో తెలుసా? అంటూ ఉద్వేగంతో చెప్పిన డైలాగులు హైలైట్ గా ఉన్నాయి.

నిడివి ఎక్కువైన కారణంగానే ఈ సీన్ ను సినిమాలో చేర్చలేదని సమాచారం.   వైజయంతీ మూవీస్‌ బ్యానర్‌పై అశ్వనీదత్‌ నిర్మించిన ఈ సినిమాలో ఆకాంక్ష సింగ్‌, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతమందించారు. ఈ చిత్రంలో సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు కీల‌క పాత్ర‌ల‌లో నటించారు.  నాని వృత్తిని, అర్హతను కించపరుస్తూ మాట్లాడగా, ఆగ్రహంతో నాని మాట్లాడే మాటలు ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: