అరవింద హిట్ అనేది ఇప్పుడు ఎన్టీఆర్ కంటే త్రివిక్రమ్ కే ముఖ్యం. అజ్ఞాతవాసి సినిమా తో త్రివిక్రమ్ తేరుకొని స్థితి లోకి వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా మొదలై విడుదలకు సిద్ధంగా ఉంది. రాయలసీమ, ఫ్యాక్షనిస్టు నేపథ్యం అనేసరికి ఆసక్తి మరింత పెరిగింది. దానికితోడు ఎన్టీఆర్ సిక్స్ ఫ్యాక్ తో ఫస్ట్ లుక్. ఇంక ఇంతకన్నా ఏం కావాలి ఫ్యాన్స్ కు. కానీ ఇదంతా అడియో విడుదలయ్యే వరకే. తీరా అడియో విడుదలయిన తరువాత ఫ్యాన్స్ ఉత్సాహం చాలావరకు నీరుకారిపోయింది. పాటలు, సాహిత్యం, విలువలు, సన్నివేశాల సంగతి అలా వుంచితే, థమన్ కాపీ ట్యూన్ లు, కేవలం రెండే డ్యూయట్లు అనేసరికి అభిమానులకు కాస్త నీరసం వచ్చిన మాటవాస్తవం.

Image result for trivikram

అయితే త్రివిక్రమ్ దెబ్బతిన్న పులిలావున్నారు. అజ్ఞాతవాసి దారుణ పరాజయం తరువాత తనేంటో చూపిస్తా అంటున్నారు అన్నది అభిమానులకు భరోసాగా వుంది. ఇదిలా వుంటే ఈ సినిమా తరువాత మళ్లీ ఏణ్ణర్థం వరకు ఎన్టీఆర్ సినిమా వుండదు. రాజమౌళితో సినిమా అంటే అదే ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందువల్ల ఈ సినిమా హిట్ ఫ్లాప్ లతో ఎన్టీఆర్ కు పెద్దగా టెన్షన్ లేదు. ఈ సినిమా తరువాత ఏడాదిన్నర సంగతి. అది కూడా రాజమౌళి సినిమా. అందువల్ల దాని బజ్ దానికి వుంటుంది.

Image result for trivikram

నిర్మాతలుగా హారిక హాసిని సంస్థకు కాస్త టెన్షన్ వుంటుంది. ఎందుకంటే అజ్ఞాతవాసి సినిమా బ్యానర్ పరువు కాస్తతీసింది. డబ్బులు వెనక్కు ఇవ్వాల్సి  వచ్చింది. మళ్లీ అలాంటి పరిస్థితి వస్తే అంత బాగోదు. కానీ సంస్థగా సమస్య ఏమీ వుండదు. మరో సినిమా చెస్తారు కావాలంటే. కానీ అసలు సిసలు టెన్షన్ అంతా దర్శకుడు త్రివిక్రమ్ దే. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ కావాలి. లేదూ అంటే ఇక త్రివిక్రమ్ సత్తా అయిపోయిందన్న విమర్శలు మొదలవుతాయి. ఈ సినిమా హిట్ అయితే బన్నీ రెడీ. వెంకీ రెడీ. కానీ ఫలితం తేడావస్తే, త్రివిక్రమ్ కు కష్టమే. పైగా హారిక హాసినికి మాత్రమే సినిమాలు చేస్తూ వస్తున్నారు. కొంతమంది హీరోలతోనే వెళ్లారు. ఫలితం తేడావస్తే, ఇవన్నీ అప్పుడు రియాక్షన్ చూపిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: