ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అన్ని భాషల హీరోయిన్లు.  ముఖ్యంగా తెలుగులో అయితే నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ పై సంచలన ఆరోపణలు చేయడమే కాదు ఇండస్ట్రీలో పలువురు ప్రముఖులు తనను దారుణంగా మోసం చేసి శారీరకంగా వాడుకున్నారని ఆరోపించింది.  ఇక బాలీవడ్ నటి తనుశ్రీ దత్తా తనపై నటుడు నానా పటేకర్ లైంగిక వేధింపులు చేశారని ఆరోపించిన విషయం తెలిసిందే.  ఆ తర్వాత  కొరియోగ్రాఫర్ గణేశ్ ఆచార్య, సినీ దర్శకుడు లు కూడా వేధించారని ఆరోపణలు చేసింది. 

Image result for tanu sri datta naan patekar

తనూశ్రీ దత్తా ఆరోపణలపై సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, సోనమ్ కపూర్, ప్రియాంక చోప్రా తనుశ్రీ దత్తాకు మద్దతుగా నిలిచారు.  కానీ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ స్పందించేందుకు నిరాకరించారు. ఈ వివాదంపై మాట్లాడటానికి తాను తను శ్రీ దత్తాను కానీ, నానా పటేకర్ ను కానీ కాదని స్పష్టం చేశారు.  దాంతో ఈ విషయంలో అమితాబచ్చన్ స్పందించక పోవడం ఎంతో శోచనీయం అని..ఒక హీరోయిన్ కి అవమానం జరిగిందంటే..లేక్కచేయకపోవడం ఎంత వరకు న్యాయం అని తనుశ్రీ దత్తా ఆవేదన వ్యక్తం చేశారు.   


అమ్మాయిల సమస్యల గురించి స్పందించని అమితాబ్ లాంటి వ్యక్తులు సామాజిక కథాంశాల ఆధారంగా ‘పింక్’ వంటి సినిమాలు తీస్తున్నారని విమర్శించింది. ఇలాంటి వ్యక్తులు నిజజీవితంలో కళ్ల ఎదుట జరిగే దారుణాన్ని ప్రశ్నించరనీ, కళ్లు మూసుకుంటారని వ్యాఖ్యానించింది. తనకు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉందనీ, త్వరలోనే తాను అమెరికాకు వెళ్లిపోతానని తెలిపింది. బాలీవుడ్ లో తిరిగి అడుగుపెట్టే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: