ఓవర్నైట్ టాలీవుడ్‌ సూపర్ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన "నోటా" అనే సినిమా రానున్న ఐదవ తారీఖు విడుదల అవుతున్న సందర్భంలో వివాదాలు ముసురుకొని ఆటంకాలు ఏర్పడే అవకాశం పుష్కలంగా కనిపిస్తున్నాయి. 


విజయ్‌ మొదటిసారి నటించిన ద్విభాషాచిత్రం "నోటా" తెలంగాణాలో ప్రముఖ రాజకీయపార్టీకి  అనుకూలంగా తెరకెక్కించారు
అని మాజీ సెన్సార్ బోర్డ్ సభ్యులు, సామాజిక కార్యకర్త, సినీ నిర్మాత కెతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమాకు వ్యతిరేకంగా నిన్న (సోమవారం) రాష్ట్ర ఎన్నికలసంఘం ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ను కలిశారు.  ‘నోటా’ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశా లు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించారని ఫిర్యాదు చేశారు.
Image result for nota movie images
తెలంగాణ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం కేతిరెడ్డి 'మీడియా పాయింట్' వద్ద విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలు జరగనున్న ప్రస్తుత నేపథ్యంలో, ఈ చిత్రాన్ని  మొదట ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ‘నోటా’ సినిమా ప్రభావం ఎన్నికలపై ఉంటుందన్నారు. ఈ సినిమా వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు
Image result for nota movie images
‘నోటా’ అన్న టైటిల్‌ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశముందని ఇలాంటి టైటిల్‌ ఎన్నికల కమీషన్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఆయన చెప్పారు. వరుస విజయా లతో జోరు మీద దూసుకుపోతున్న విజయ్‌ దేవరకొండ  సినిమా ‘నోటా’  ఈ నెల 5వ తేదీన విడుదల కానుంది.
Image result for nota movie images
సాధారణంగా ఒక సినిమా వెండి తెర పైకి తెచ్చేటప్పుడు సామాజిక రాజకీయ వివాదాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు చిత్ర యూనిట్ సభ్యులు. కానీ గత కొంత కాలంగా వివాదాస్పదమయ్యే సినిమాలకు ఆ చర్చే ఒక విధంగా బలమైన ప్రచారం తెస్తుంది. ఉదాహరణగా విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాను చెప్పుకోవచ్చు. 
అయితే విమర్శలకు విజయ్ అప్పుడే తనదైన శైలిలో కౌంటర్లు ఇచ్చాడు. బూతు మాట తో ఊహించని విధంగా కామెంట్స్ చేసేవాళ్లకు కౌంటర్లు కూడా బాగానే ఇచ్చాడు.
Image result for nota movie images
ఇక మొన్న రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన "గీతగోవిందం" పై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా వాటిని కూడా వినియోగించుకొని చాలా ఈజ్ తో ప్రమోషన్ లో మిక్స్ చేసి వాడేశాడు విజయ్ దేవరకొండ.   

Image result for nota movie images

మరింత సమాచారం తెలుసుకోండి: