అర్జున్ రెడ్డి లాంటి క్రేజీ మూవీ చేసిన తర్వాత ఆ సినిమాకు ఏమాత్రం సంబంధం లేని పాత్రతో గీతా గోవిందం అంటూ ప్రేక్షకులను మెప్పించి 100 కోట్ల హీరోగా తన సత్తా చాటాడు విజయ్ దేవరకొండ. పరశురాం డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో బన్ని వాసు నిర్మించారు. ఈ సినిమాతో విజయ్ రేంజ్ మరింత పెరిగింది.


ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది. ముఖ్యంగా సినిమాలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ ప్రేక్షకులను మెప్పించింది. 1 మిలియన్ వ్యూస్ తో ఎడిటెడ్ వీడియోనో హంగామా సృష్టించింది. ఎక్కడ విన్నా చూసినా ఆ సాంగ్ వినిపించేది. అయితే ఈ సాంగ్ అసలు గీతా గోవిందం కోసం అనుకున్నది కాదట.


గోపి సుందర్ మ్యూజిక్ చేయాల్సిన ఆది తాప్సి జంటగా నటించిన నీవెవరో సినిమాకు అనుకున్నదట. అయితే ఆ సినిమా నుండి గోపి సుందర్ బయటకు వచ్చాడు. అందుకే ఆ సాంగ్ ను గీతా గోవిందంకు వాడారట. ఇక గీతా గోవిందంలో ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు.


ఫైనల్ గా విజయ్ దేవరకొండ లక్ తోనే ఆ పాట తన సినిమాలోకి రావడం అది పెద్ద హిట్ అవడం సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఒకవేళ ఈ పాట ఆది సినిమాలో ఉన్నా ఇంతగా ప్రేక్షకాదరణ పొందేది కాదని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఎవరికి ఏది ఎప్పుడు ఎలా రావాలో అలానే వస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: