తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు.  అయితే బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ పై మొదటి నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి.  అంతే కాదు బిగ్ బాస్ లో రెండో వారం నుంచి కౌశల్ చూపించిన పర్ఫామెన్స్ తో అభిమానులను సంపాదించాడు. ఇక  కౌశల్ ఆర్మీ ఏర్పడిన తర్వాత అనూహ్యంగా ప్రతి వారం కౌశల్ తన టార్గెట్ పూర్తి చేస్తూ ముందుకు సాగాడు.  ఇంటి సభ్యులు ఎన్ని అవాంతరాలు కల్పిస్తున్నా..ఎన్ని ఇబ్బందులు పెట్టిన కౌశల్ మాత్రం తక మనోధైర్యాన్ని ఎక్కడా పోనివ్వకుండా అన్ని రకాల టాస్కులు..గెమ్స్ ఆడుతూ వచ్చాడు. 

ఇక కౌశల్ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన తర్వాత ఆయనకు ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు.  తాజాగా కౌశల్ తనకు స్ఫూర్తి..తాను బిగ్‌బాస్ షోలో పాల్గొనడం వెనక టాలీవుడ్ నటుడు మహేశ్ బాబు ప్రోత్సాహం ఉందని బిగ్‌బాస్-2 విజేత కౌశల్ తెలిపాడు.  మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’తోనే తమ మధ్య సాన్నిహిత్యం ఉందన్న కౌశల్. తాను బిగ్‌బాస్‌కు వచ్చానంటే దానికి కారణం మహేశ్ బాబేనని కౌశల్ అన్నాడు. హైదరాబాద్‌లో తొలిసారి మోడలింగ్ అకాడమీ ఏర్పాటు చేసింది తానేనన్న కౌశల్.. అందుకోసం మహేశ్ ఎంతో సాయం చేశాడని గుర్తు చేసుకున్నాడు. 

మహేశ్ బాబు లేకుంటే తాను లేనంటూ కౌశల్ చెప్పిన వీడియోను ఇప్పుడు మహేశ్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ఎంతో సాయం చేశారని పేర్కొన్నాడు. రాజకుమారుడు సినిమా సమయంలో దగ్గురుండి అకాడమీని ఏర్పాటు చేయించినట్టు చెప్పాడు. ఆ ఏజెన్సీ లేకపోతే తానెప్పుడో తిరిగి వైజాగ్ వెళ్లిపోయి ఉండేవాడినన్నాడు. ఈ సందర్భంగా తన గెలుపునకు కృషి చేసిన కౌశల్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలిపాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: