బిగ్ బాస్ తెలుగు సీజన్ 1, 2 సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్నాయి. మొదటి సీజన్ శివ బాలాజి విన్నర్ కాగా.. సెకండ్ సీజన్ కౌశల్ విన్నర్ గా నిలిచాడు. ఎన్.టి.ఆర్ హోస్ట్ గా శివ బాలాజి విజేతగా నిలవగా.. నాని హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ 2లో కౌశల్ టైటిల్ గెలుచుకున్నాడు. అయితే ఈ ఇద్దరికి ఒక కామన్ పాయింట్ ఉంది.


అదేంటో తెలుసా.. కాజల్ బావలయ్యారు కాబట్టే ఈ ఇద్దరు బిగ్ బాస్ విన్నర్స్ అయ్యారని వార్తలొస్తున్నాయి. ఈ ఇద్దరు కాజల్ బావలవడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. కాజల్ చేసిన సినిమాల్లో శివ బాలాజి, కౌశల్ ఇద్దరు బావలుగా చేశారు అందుకే బిగ్ బాస్ విన్నర్స్ అయ్యారని అంటున్నారు.


అదెలా అంటే చందమామ సినిమాలో కాజల్ బావగా శివ బాలాజి నటించాడు.. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో కౌశల్ కూడా కాజల్ బావగా నటించాడు. ఈ ఇద్దరు కాజల్ బావలయ్యారు కాబట్టే బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నారని అంటున్నారు. సీజన్ 1, 2 సేమ్ టూ సేమ్ అనేలా అలా కుదిరింది.  


అయితే ఇదేదో సరదాగా అనుకుంటున్నా వచ్చే సీజన్ లో కాజల్ బావగా చేసిన వారే గెలుస్తారా లేదా అన్నది చూడాలి. బిగ్ బాస్ 3కి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ మళ్లీ బుల్లితెర మీద సందడి చేయనున్నారట. మరి బిగ్ బాస్ 3 ఎలాంటి హంగామా సృష్టించబోతుందో చూడాలి. బిగ్ బాస్ 3 కంటెస్టంట్స్ ఎవరు ఉంటారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: