యువ సంచలనం విజయ్ దేవరకొండ హీరోగా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్నాడు. మూడు వరుస హిట్లతో మంచి జోష్ మీద ఉన్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం నోటా సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా డియర్ కామ్రేడ్ సినిమా కూడా చేస్తున్నాడు.


నోటా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తన స్క్రీన్ నేమ్ పై డిస్కస్ చేయడం జరిగింది. విజయ్ తనని తానే రాజా ది రాజా అంటూ సంభోదించుకున్నాడు. అయితే సదరు ఇంటర్వ్యూయర్ దేవా ది దేవా అంటే ఇంకా బెటరేమో అనేశాడు. రాజా ది రాజా.. దేవాది దేవా ఇలా బెటర్ అన్నాడు.


కొన్నాళ్లుగా విజయ్ స్క్రీన్ పై డిస్కషన్స్ భారీ రేంజ్ లో జరుగుతున్నాయి. సూపర్ పవర్ స్టార్.. తెలంగాణా మెగాస్టార్ ఇలా పిలుస్తుండగా తన స్క్రీన్ నేం క్లూ ఇస్తూ రాజా ది రాజా అనే ట్యాగ్ లైన్ తనకు తానే ఇచ్చేసుకున్నాడు విజయ్. చూస్తుంటే తనని అలా పిలవడం సంతోషం అనుకుంటున్నాడేమో.


అందుకే రాజా ది రాజా అనే స్క్రీన్ నేం విజయ్ దేవరకొండకు ఫిక్స్ చేశారు. తన ప్రతి సినిమాతో ఓ సర్ ప్రైజ్ ఇస్తున్న విజయ్ దేవరకొండ కొత్తగా తానో ప్రొడక్షన్ కూడా మొదలు పెడుతున్నట్టు ఎనౌన్స్ చేశాడు. ప్రొడక్షన్ పేరు కూడా కిన్ ఆఫ్ ద హిల్ అని పెట్టాడు. మరి చూస్తుంటే విజయ్ కొత్త సంచలనానికి శ్రీకారం చుట్టాడని అనిపిస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: