తెలుగు ఇండస్ట్రీలో మణిరత్నం చిత్రాలంటే ఎంతో ప్రత్యేక ఉంటుందో అందరికీ తెలిసిందే.  అయితే గత కొంత కాలంగా ఆయన తీసిన చిత్రాలు పెద్దగా విజయాన్ని అందుకోకపోవడంతో మణిరత్నం మార్క్ పడిపోతుందని కామెంట్స్ వచ్చాయి.  ‘ఒకే బంగారం’ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కిన ‘చెలియా’ మూవీ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విపలమైంది. దాంతో మణిరత్నం మార్క్ పడిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో..అరవింద స్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, ప్రకాష్ రాజ్ ముఖ్యపాత్రల్లో ‘చెక్క చివంత వానం’ తెలుగు లో ‘నవాబ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. 


ఈ చిత్రం అనుకున్న అంచనాలు చేరుకొని మంచి విజయాన్ని నమోదు చేసుకుంది.  మొదటి మూడు రోజులకు గాను తమిళనాడులో ఈ మూవీ రూ.21.70 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆదివారంతో రూ. 8 కోట్లతో కలిపి ఈ మూవీ మొత్తంగా రూ.30 కోట్లను కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే..తాజాగా మణిరత్నం కార్యాలయాన్ని బాంబులతో పేల్చి వేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.  దీంతో ఇండస్ట్రీ ఒక్కసారే ఉలిక్కి పడింది.  వివరాల్లోకి వెళ్తే, మణిరత్నం తెరకెక్కించిన 'నవాబ్' చిత్రం ఇటీవలే విడుదలై, విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.


ఈ నేపథ్యంలో, సినిమాలో ఒక అభ్యంతరకర డైలాగ్ ను తొలగించాలని చెన్నైలోని అభిరామపురంలో ఉన్న మణిరత్నం కార్యాలయానికి ఓ ఆగంతుకుడు ఫోన్ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఆ డైలాగ్స్ తొలగించకుంటే..కార్యాలయాన్ని బాంబులతో పేల్చేస్తామని బెదిరించినట్లు సిబ్బంది తెలిపారు. కాకపోతే ఏ ఆ సినిమాలో ఏ డైలాగ్స్ తొలగించాలన్న విషయం మాత్రం వెల్లడించలేదట ఆ అగంతకుడు.  ఇక బెదిరింపులకు సంబంధించి ఫిర్యాదు అందడంతో... మణి కార్యాలయానికి పోలీసులు భద్రతను కల్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: