తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించారు.  ఈసారి బిగ్ బాస్ లోకి పదిహేడు మంది కంటిస్టెంట్లు వచ్చిన విషయం తెలిసిందే.  అందులో ముగ్గురు కామన్ మాన్ గా ఎంట్రీ ఇచ్చారు.  అయితే గత బిగ్ బాస్ సీజన్ 1 తో పోల్చుకుంటే..బిగ్ బాస్ సీజన్ 2 పై మొదట్ల బాగా విమర్శలు వచ్చాయి.  ఇంటి సభ్యులు వ్యవహరిస్తున్న తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.  ఇదిలా ఉంటే..బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మోడల్, నటుడు కౌశల్ మొదటి వారం, రెండో వారం సాదా సీదాగా గడిపినా..మూడో వారం నుంచి అతనిపై ఇంటి సభ్యులు అటాక్ చేయడం మొదలు పెట్టారు..ప్రతి చిన్న విషయంలోనూ కౌశల్ ని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు.   

కెప్టెన్ టాస్క్ లో కిరీటి చేసిన హడావుడి..కొంత మంది ఇంటి సభ్యులు ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని కామెంట్స్ చేయడంతో కౌశల్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఒక్కసారే ఆయనను హీరోని చేశాయి.  అప్పటి నుంచి ఇంటి సభ్యులతో వన్ ఆర్మీ షో చేయడం మొదలు పెట్టారు.  దీనికి తోడు బయట కౌశల్ ఆర్మీ ఏర్పడి..ప్రతి విషయంలో కౌశల్ ని సేవ్ చేస్తూ రావడమే కాదు..ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యేలా ఓటింగ్ చేస్తూ వచ్చిందని టాక్.  ఏది ఏమైనా మొదటి నుంచి కౌశల్ బిగ్ బాస్ హౌజ్ లో వ్యవహరిస్తున్న తీరు..స్టాటజీ ఆయను అన్నింటా ముందుకు నడిచేలా చేసింది. 

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ ని విన్నర్ గా అయ్యాడు..విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా టైటిల్ అందుకున్నాడు.  ఇదిలా ఉంటే..ఇప్పుడు బిగ్ బాస్ పుణ్యమా అని కౌశల్ హీరోగా మారబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.   గతంలో సినిమాల్లోను .. సీరియల్స్ లోను .. యాడ్స్ లోను నటించిన అనుభవం కౌశల్ కి వుంది.  'బిగ్ బాస్ 2'లో కౌశల్ ను గెలిపించిన కౌశల్ ఆర్మీ .. ఆయన కోసం నిర్మాతలుగా మారుతున్నారు. అంతా కలిసి 4 కోట్ల రూపాయలను పోగేసి ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. కౌశల్ సోలో హీరోగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.      



మరింత సమాచారం తెలుసుకోండి: