టాలీవుడ్ లో ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిన హీరో విజయ్ దేవరకొండ.  పెళ్లి చూపులు సినిమాతో తనదైన మానరీజంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన విజయ్ దేవరకొండ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా తనదైన మార్క్ చాటుకున్నాడు.  అర్జున్ రెడ్డిలో బోల్డ్, అగ్రసీవ్ గా నటించిన విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’ సినిమాలో డిఫరెంట్ లుక్ తో కనిపించి అందరినీ కడుపుబ్బా నవ్వించాడు. 
Image result for koratala shiva
ఈ రెండు సినిమా వేరియెషన్స్ తో విజయ్ దేవరకొండ తెలుగులోనే కాదు తమిళ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.  ప్రస్తుతం విజయ్ నటించిన ‘నోటా’ సినిమా ఈ నెల 5 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాతో కోలీవుడ్ లోకి కూడా అడుగు పెడుతున్నాడు విజయ్ దేవరకొండ.   ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ 'డియర్ కామ్రేడ్'ను పూర్తి చేసే పనిలో పడనున్నాడు.

ఈ సినిమా కాకుండా ఆల్రెడీ ఆయన చేతిలో రెండు మూడు ప్రాజెక్టులు వున్నాయి.  ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండతో సినిమా తీయడానికి దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు.  ఈ హీరోతో తక్కువ బడ్జెట్ లో సినిమా తీస్తే మినిమం గ్యారెంటీ వసూళ్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. ఇదే జాబితలో వరుస విజయాలతో దూసుకు పోతున్న ప్రముఖ రచయిత, దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు. 

  'పెళ్లి చూపులు' నుంచి విజయ్ దేవరకొండ కోసం కథను రెడీ చేయాలనుకుంటున్నాను. కానీ ఆయన విభిన్నమైన కథా చిత్రాలను చేస్తూ ఏ తరహా కథను సిద్ధం చేయాలనే విషయంలో కాస్త టైమ్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  మంచి స్క్రిప్ట్ తో త్వరలోనే విజయ్ దేవరకొండను కలుస్తాను' అని  చెప్పారు. దాంతో చిరంజీవి ప్రాజెక్టు తరువాత కొరటాల చేయనున్న సినిమా విజయ్ దేవరకొండతోనేనని అంతా అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: