బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ గా కౌశల్ నిన్న తన ఫ్యాన్స్ తో చేసిన సెలబ్రేషన్స్ అందరికి తెలిసిందే. బిగ్ బాస్ హౌజ్ లో తన అనుభవాలను తన ఆర్మీతో పంచుకున్న కౌశల్ ఫ్యాన్స్ కోరిక మేరకు హీరోగా కొత్త టర్న్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే అతను ఆల్రెడీ సినిమాలు చేశాడు. 


మహేష్ రాజకుమారుడు విలన్ గా.. ప్రభాస్ మిస్టర్ పర్ఫెక్ట్ లో చిన్న రోల్ చేసిన కౌశల్ 2012లో రవితేజ దరువు సినిమాలో కనిపించాడు. సీరియల్స్ తో బిజీగా ఉన్న కౌశల్ బిగ్ బాస్ తో వచ్చిన క్రేజ్ తో హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అయితే అంతకన్నా ముందే కౌశల్ కు స్టేట్ రౌడీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది.


బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడే అతనికి వస్తున్న ఫాలోయింగ్ చూసి బోయపాటి శ్రీను కౌశల్ కు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. అయితే ప్రస్తుతం చేస్తున్న చరణ్ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ ఉందట. ఎలాగు బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చాడు కాబట్టి కౌశల్ తో ఆ పాత్ర చేయించాలని చూస్తున్నాడట బోయపాటి శ్రీను.


సో స్టేట్ రౌడీలో చరణ్ తో పాటుగా కౌశల్ కూడా కనిపించనున్నాడు. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని స్టేట్ రౌడీలో కౌశల్ ఉన్న వార్త నిజం అయితే మాత్రం సినిమాకు అదనపు ఆకర్ష్ణణ లభించినట్టే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు స్టేట్ రౌడీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2019 సంక్రాంతి బరిలో దిగుతుందని తెలుస్తుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: