తెలుగు ఇండస్ట్రీలో కేవలం మూడు చిత్రాలతోనే ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాడు విజయ్ దేవరకొండ.  పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతాగోవిందం.  ఈ మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ లుక్స్ తో కనిపించిన విజయ్ దేవరకొండ తాజాగా ‘నోటా’చిత్రంతో ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు.  విజయ్ దేవరకొండ, మెహ్రిన్ కౌర్ జంటగా నటించిన చిత్రం 'నోటా'.  ఇప్పటికే ఈ చిత్రంపై రక రకాల వివాదాలు మొదలయ్యాయి.  గతంలో విజయ్ దేవరకొండ నటించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంపై కూడా ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి.

కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత అందరి అభిప్రాయం మార్చుకున్నారు.   ఇప్పుడు  ‘నోటా’చిత్రంపై కూడా రక రకాల విమర్శలు, వివాదాలు వస్తున్నాయి.  కానీ, అందరూ అనుకున్నట్లు ఈ చిత్రంలో ఎలాంటి వివాదం ఉండబోదని చిత్ర యూనిట్ అంటున్నారు.  ఈ చిత్రం అక్టోబర్ 5వ తేదీన విడుదల కానుంది. దీంతో సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఆదివారం విజయవాడలో పబ్లిక్ పబ్లిక్ నిర్వహించారు.

ఇక తాజాగా హైదరాబాద్లో కూడా పబ్లిక్ మీట్ నిర్వహించారు, ఈ పబ్లిక్ మీట్ కార్యక్రమానికి డైరెక్టర్ ఆనంద్ శంకర్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ నిర్మాత జ్ఞానవేల్ రాజా హాజరయ్యారు.  ఈ సందర్బంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..  ఈ మూవీ రిలీజ్ ఆపాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అఫిడవిట్లు దాఖలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మూవీ వస్తుండడంతో ఈ మూవీ చూసి అందరూ నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ మూవీ ఉంటుంది అని అంటున్నారు.

ఈ చిత్రం చూసిన తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోతాయని..చిత్రం గురించి ఏమీ తెలియకుండా ఎలా ఊహిస్తారు అని అన్నాడు విజయ్ దేవరకొండ. చిత్రాలు చూసి ఓటు వేసే పరిస్థితిలో జనాలు లేరు. వాళ్లకు ఏం చేయాలో తెలుసు అన్నారు. అక్టోబర్ 5న మీ అందరికీ ఓ కొత్త ఫ్రెష్ మూవీ ఇవ్వబోతున్నా. 5న థియేటర్స్‌లో కలుద్దాం. ‘నోటా’ మూవీ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా.. అని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: