టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ బయోపిక్’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్నాడు.  ఈ సినిమాలో ఎన్టీఆర్ జీవితంలో నటన, రాజకీయ కోణాలు ఆవిష్కరించబోతున్నారని టాక్. అందుకోసం పాత్రలు కూడా దానికి అనుకూలంగా ఉన్నవారినే ఎంచుకుంటున్నారు. ఎన్టీఆర్ నటన జీవితంలో ముఖ్యమైన వారు ఏఎన్ఆర్.  ఇక ఏఎన్ఆర్ పాత్రలో ఆయన మనవడు సుమంత్ నటిస్తున్నాడు.  దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.   

బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటిస్తున్నారు.  ఇక రాజకీయ నేపథ్యంలో చూస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ పాత్రలో రానా నటిస్తున్నారు..దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది.  అంతే కాదు ఎన్టీఆర్ నటనా జీవితంలో మరో ముఖ్యపాత్ర శ్రీదేవి, జయప్రద,సావిత్రి.  ఈ పాత్రలో శ్రీదేవి రోల్ లో రకూల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా, ఇప్పటికే ఆమెకి సంబంధించిన వెర్షన్ పూర్తి కావలసింది. కానీ బాలీవుడ్ షూటింగులో ఆమె బిజీగా ఉండటం వలన ఆలస్యమైంది. శ్రీదేవి పాత్ర కోసం రకుల్ 10 రోజులను కేటాయించిందట. ఈ నెల 10వ తేదీన రకుల్ పుట్టినరోజు కావడం వలన, ఆ రోజున శ్రీదేవిగా ఆమె లుక్ ను రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారని సమాచారం.  అప్పట్లో శ్రీదేవికి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే..ఈ నేపథ్యంలో ఆమె పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                


మరింత సమాచారం తెలుసుకోండి: