ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్.టి.ఆర్ స్పీచ్ అందరిని కంట నీరు వచ్చేలా చేసింది. తండ్రి చనిపోయిన తర్వాత మొదటిసారి అభిమానుల మధ్యకు వచ్చిన ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రాం లు తమ ఎమోషన్ ను ఆపుకోలేకపోయారు.


అందుకే ముందు కళ్యాణ్ రాం తండ్రిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోగా.. ఆ తర్వాత మైక్ అందుకున్న ఎన్.టి.ఆర్ కూడా తండ్రిని స్మరించుకుంటూ స్పీచ్ ఇచ్చాడు. 12 ఏళ్లుగా త్రివిక్రంతో పరిచయం ఉన్నా సినిమా చేయలేదు. కాని సినిమా మొదలు పెట్టాం నాన్న దూరమయ్యారు. బహుశా ఈయనతో సినిమా చేయాలంటే జీవితంలో పరిపక్వత రావాలేమో అందుకే ఆయన దూరమయ్యారేమో అంటూ గుండెనిండా బాధతో తన ప్రసంగం సాగించాడు ఎన్.టి.ఆర్.   


అంతేకాదు 28 సినిమాల్లో ఎప్పుడు తండ్రి చితికి నిప్పంటించే సీన్ రాలేదు. కాని ఈ సినిమాలో వచ్చింది. అది యాదృశ్చికమో ఏమో తెలియదు. ఇక తండ్రి గురించి ప్రస్థావిస్తూ ఎప్పుడు అభిమానుల గురించి చెప్పే నాన్న వారిని ఎప్పుడు వదులుకోవద్దని.. రిని ఎప్పుడూ దృష్టిలో ఉంచుకోవాలని చెప్పారన్నారు. అంతేకాదు ఓ తండ్రికి గొప్ప కొడుకుగా.. కొడుకులకు గొప్ప తండ్రిగా.. భార్యకు గొప్ప భర్తగా.. మనవళ్లకు గొప్ప తాతగా ఆయన ఉన్నారని గుర్తుచేసుకున్నారు.   


సినిమా గురించి మాట్లాడుతూ సినిమాతో త్రివిక్రం బంధం మరింత పెరిగిందని.. ఆయన ఇప్పుడు తనకు ఆత్మబందువని అన్నారు. పదే పదే త్రివిక్రం ను స్వామి అంటూ సంభోదించడం త్రివిక్రం తో తారక్ ఎటాచ్ మెంట్ ఎంతగా పెరిగిందో అర్ధమయ్యింది. ఇక సినిమాకు పనిచేసిన నటీనటుల గురించి.. టెక్నిషియన్స్ గురించి మాట్లాడిన తారక్ ఈ సినిమా మ్యూజిక్ కోసం తమన్ ప్రాణం పెట్టాడని.. అతను తప్ప ఇంకెవ్వరు ఈ సినిమాకు ఇంత బాగా మ్యూజిక్ ఇవ్వరని అన్నాడు. ఇక చివరగా మీ అందరి ముఖాల్లో నాన్న కనిపిస్తున్నారని చెప్పిన తారక్ ఆయన ఆశీస్సులతో ఈ సినిమా పెద్ద విజయం అందుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: