విజయ్ దేవరకొండ ప్రతి సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. పెళ్లిచూపులు సినిమా నుండి గీతా గోవిందం వరకు హీరోగా చేసింది మూడు సినిమాలే అయినా యూత్ లో విజయ్ అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆనంద్ శంకర్ డైరక్షన్ లో నోటా సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.


ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు విజయ్ దేవరకొండ. తమిళ తెలుగు భాషల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కేవలం తెలుగు వర్షనే పాతిక కోట్ల దాకా బిజినెస్ చేసిందని అంటున్నారు. ఆంధ్రా, తెలంగాణాలో నోటా 19 కోట్ల దాకా బిజినెస్ చేసిందట.


ఇక కర్ణాటక, తమిళనాడు (తెలుగు వర్షన్), రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.5 కోట్లు బిజినెస్ చేయగా.. ఓవర్సీస్ లో 3.5 కోట్లు దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. టోటల్ గా నోటా తెలుగు వర్షనే 25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని తెలుస్తుంది. విజయ్ కెరియర్ లో ఇది హయ్యెస్ట్ బిజినెస్ చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు,


విజయ్ లాస్ట్ మూవీ గీతా గోవిందం కేవలం 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది. కాని ఆ సినిమా 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో దుమ్ముదులిపేసింది. సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ వెళ్తున్న విజయ్ దేవరకొండ నోటా మూవీతో ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో చూడాలి. స్టూడియో గ్రీన్ ప్రొడక్షన్స్ లో జ్ఞానవెల్ రాజా నిర్మించిన ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: