ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా లో యాక్షన్ సీన్స్ చాలా భయంకరంగా ఉన్నాయని చెప్పాలి. సింహాద్రి ని మించి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా ఎన్టీఆర్ మాట్లాడుతూ..  త్రివిక్రమ్ తో సినిమా చేయాలన్నది తన 12ఏళ్ల కల అని వెల్లడించారు. చాలాసార్లు అనుకున్నాం. కానీ ప్రతిసారీ ఏదో ఒక చిన్న అడ్డంకి వస్తూ వుండేది. ఏమిటో మా ఇద్దరికీ అర్థంకాలేదు.

Image result for ntr aravinda sametha

ఎప్పుడో నువ్వే.. నువ్వే చిత్రం దగ్గర నుంచి త్రివిక్రమ్ మిత్రుడు. ఇంత స్నేహం వున్నా, ఎందుకు సినిమా కుదరడం లేదు అనుకున్నాను చాలాసార్లు. బహుశా నా జీవితంలో నెలరోజుల క్రితం జరిగిన సంఘటనతో నాకు జీవితం విలువ తెలిసింది. ఎలా బతకాలో చెప్పేసినిమా అరవింద సమేత వీరరాఘవ అని ఎన్టీఆర్ అన్నారు. చాలామంది ఈ టైటిల్ ఏమిటి పవర్ ఫుల్ గా లేదన్నారు. కానీ ఓ మగాడి పక్కన ఆడదానికన్నా  పవర్ ఫుల్ గా మరేదీ వుండదు అని ఎన్టీఆర్ అన్నారు.

Image result for ntr aravinda sametha six packs

తనకు పరిపక్వత వచ్చేదాకా ఆగి భగవంతుడు ఈ సినిమా ఇచ్చాడేమో అని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా తరువాత మిత్రుడు త్రివిక్రమ్ ఆత్మ బంధువుగా మారిపోయాడని అన్నారు. అరవింద సమేత వీరరాఘవ సినిమాలో విలన్ పాత్ర పోషించింది జగపతి బాబు. సినిమాలో అరివీర క్రూయల్ గా వుంటుంది జగపతి బాబు పాత్ర అన్నది ఇప్పటికే ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతి. జగపతి బాబు ఆరవింద సమేత ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మాట్లాడుతూ, ఆ సినిమాలోని ఓ డైలాగు వినిపించారు. 'చావు చొక్కాలేకుండా తిరిగినట్లు వుంటుందట' ఎన్టీఆర్ ను సినిమాలో చూస్తే.

మరింత సమాచారం తెలుసుకోండి: