పవన్ ఈమధ్య పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీలక్ష్మీనరసింహ ఆలయంలో రహస్య పూజలు చేయించుకున్నాడు అని వచ్చిన వార్తల పై పవన్ ఘాటైన సమాధానం ఇచ్చాడు. జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ కొన్ని మీడియా సంస్థలు మరియు ఛానల్స్ తన పై చేస్తున్న స్టింగ్ ఆపరేషన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 
మార్పు ఎందుకు రాదో చూద్దాం
తాను ఏదైనా ఒక దేవాలయంకు వెళ్ళి అక్కడ పొరపాటున పూజలు చేస్తే అది క్షుద్ర పూజలు అని వార్తలు రాస్తున్నారని కామెంట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు జనసేనాని. ఒక పాప ‘జనసేన’ పార్టీ కోసం 1350 విరాళంగా ఇవ్వబోతే దానిని తీసుకోకుండా తాను ఆ అమ్మాయి వద్ద నుండి 11రూపాయిల కాయిన్స్ తీసుకుంటే దానిని వక్రీకరించి పవన్ ఒకపాప వద్ద నుండి 11 రూపాయలు దొంగిలించాడు అంటూ వార్తలు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అంటూ మీడియా పై సెటైర్లు వేసాడు పవన్. 
చింతలపూడి, ఏలూరులో గెలుస్తాం
అనుకోకుండా పవన్ అన్న మాటలు నవ్వు తెప్పిస్తూ ఉన్నా తన పై మీడియా చేస్తున్న వ్యతిరేక ప్రచారానికి పవన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఈమాటలు బట్టి అర్ధం అవుతుంది. దీనితో పవన్ వ్యూహాలు మార్చి తనకు పేపర్లు పేరు మోసిన ఛానల్స్ లేవనీ తన అభిమానుల ఫేస్‌ బుక్ వాట్సాప్‌ లే తన మీడియా సంస్థలు అంటూ తన పై వస్తున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పి కొట్టమని అభిమానులకు సంకేతాలు ఇస్తున్నాడు పవన్. 
'పసిపాప నుంచి రూ.11 దొంగిలించిన పవన్ కళ్యాణ్' అంటారేమో
పవన్ ఇప్పటి వరకు నిర్వహించిన ‘ప్రజాపోరాట’ యాత్రలకు భిన్నంగా పశ్చిమ గోదావరి జిల్లాలో యూత్ పవన్ కు బ్రహ్మరధం పట్టడం రాజకీయ వర్గాలలో కలవర పాటు మొదలైంది. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఉభయ గోదావరి జిల్లాల పై పవన్ తన దృష్టి పెట్టడంతో పాటు ఆజిల్లాలలో పవన్ కు విపరీతమైన స్పందన రావడం చూస్తుంటే ‘జనసేన’ కు రాబోతున్న ఎన్నికలలో ఈ జిల్లాల నుండి కొన్ని గణనీయమైన సంఖ్యలో సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: