టాలీవుడ్ లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నాని, సమంతలు నటించిన ‘ఈగ’ సినిమా ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.  హీరో లేకుండా కేవలం ఒక్క ఈగతో విలన్ పై ఎలా రివేంజ్ తీర్చుకుంటుందో గ్రాఫిక్ మాయాజాలంతో మంత్ర ముగ్దులను చేశారు రాజమౌళి.  ఈ సినిమాలో కన్నడ హీరో కిచ్చ సుదీప్ నెగిటీవ్ పాత్రలో నటించారు. 

ఈగ సినిమాతో తెలుగు, కన్నడ, తమిళ ఇండస్ట్రీలో ఎంతో గొప్ప పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగు లో కొన్ని కొన్ని సినిమాల్లో నటించారు సుదీప్.  ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ లో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు సుదీప్.  ప్రస్తుతం సుదీప్ ‘పైల్వాన్’సినిమాలో నటిస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ సందర్భంగా కారు ప్రమాదం జరిగినట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.

ఈ ప్రమాదంలో సుదీప్ కు స్వల్ప గాయాలు అయ్యాయనీ, ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది.  కన్నడంలో ఎక్కువ శాతం యాక్షన్ తరహా సినిమాల్లో నటించే సుదీప్ ఆ మద్య పవన్ కళ్యాన్ నటించిన అత్తారింటికి దారేది రిమేక్ లో పవన్ పాత్రలో నటించారు. 

ఈ ప్రమాదం కారణంగానే.. ఇటీవల జరిగిన ‘విలన్’ సినిమా టీజర్ విడుదలకు సుదీప్ గైర్హాజరయ్యారు. తాను గాయపడ్డందున ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు సుదీప్ ట్వీట్ చేశారు.  ప్రస్తుతం సుదీప్ ఆరోగ్యం నిలకడగానే ఉందట.   సుదీప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు పలు ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: