తెలుగు బుల్లితెరపై వచ్చిన బిగ్ బాస్ సీజన్ 2 మొన్నటి ఆదివారం ముగిసింది.  113 రోజులు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ షోలో చిరవగా ఐదురు ఇంటి సభ్యులు మిగిలారు. వారే..కౌశల్, దీప్తి, గీతామాధురి,తనిష్, సామ్రాట్.  బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కౌశల్ కి ఓ ప్రత్యేమ అభిమాన సంఘాలు ఏర్పడ్డ విషయం తెలిసిందే. సాధా సీదాగా ఎంట్రీ ఇచ్చిన కౌశల్ రెండో వారం నుంచి తానేంటో ప్రూవ్ చేసుకోవడం మొదలు పెట్టాడు.  ఎన్ని టాస్క్ లు ఇచ్చినా తనదైన వెరైటీ స్టైల్లో ప్రజెంట్ చేశాడు. 

ఇంటి సభ్యులు ఎంత ఇబ్బంది పెట్టినా..మాటలు అన్నా సహనంతో ముందుకు సాగాడు.  ఇలాంటి లక్షణాలతో బిగ్ బాస్ హౌజ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న కౌశల్ కి బయట కౌశల్ ఆర్మీ ఎంతో సహకరించింది.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 కి కౌశల్ విన్నర్ గా నిలిచారు.  విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ అందుకున్నాడు. 

ఈ షో నేచురల్ స్టార్ నాని హూస్ట్ చేసిన విషయం తెలిసిందే.  అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడం తనాను ఇలా సహనంతో ముందుకు సాగడం..ఇవన్నీ మహేష్ బాబుని చూసి నేర్చుకున్నానని..ఆయన అంటే ఎంతో గౌరవం అని కౌశల్ అన్నారు.  తాను ‘రాజకుమారుడు’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కౌశల్.  తర్వాత చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.

కొన్ని సీరియల్స్ లో నటించిన కౌశల్ మోడల్ గా మంచి పేరు సంపాదించాడు.  తాజాగా బిగ్ బాస్ సీజన్-2లో విజేతగా నిలిచిన కౌశల్ ను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభినందించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెడుతూ, "కంగ్రాచ్యులేషన్స్ కౌశల్. ఇదో గొప్ప విజయం. నిన్ను చూసి నేను చాలా సంతోషిస్తున్నా. నీ విజయాన్ని ఆస్వాదించు" అని వ్యాఖ్యానించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: