తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు విజయ్ దేవరకొండ అంటే..ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.  పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ..‘అర్జున్ రెడ్డి’తో యూత్ కి బాగా కనెక్ట్ అయ్యాడు.  ఈ మద్య పరుశరామ్ దర్శకత్వంలో రష్మిక మందన హీరోయిన్ గా తెరకెక్కిన ‘గీతాగోవింద’చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరాడు.  ఇప్పుడు చిన్న నిర్మాతలకు కల్పతరువుగా మారాడు విజయ్ దేవరకొండ.  తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో 'నోటా' చిత్రం రూపొందింది.

రాజకీయాల నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమాను, ఈ నెల 5వ తేదీన విడుదల చేయనున్నారు.  అయితే ఈ చిత్రంపై మొదటి నుంచి ఎన్నో రకాలుగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ చిత్రంలో కొన్ని వివాదాస్పదమైన సన్నివేశాలు .. డైలాగులు వున్నట్టుగా సెన్సార్ సభ్యులు గుర్తించారట. అంతే కాదు త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఈ చిత్రం ఓ పార్టీకి సపోర్ట్ గా ఉందన్న వివాదాలు కూడా వచ్చాయి.

  అయితే ఈ మద్య జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈ చిత్రం ఏ పార్టీకి సంబంధించింది కాదని..‘నోటా ’ చూస్తే మీకే అర్థం అవుతుందని అన్నాడు విజయ్ దేవరకొండ. ఈ చిత్రంలో  అభ్యంతరకరమైన ఆ సన్నివేశాలను తొలగించాలనీ, ఆ డైలాగులను మ్యూట్ చేయాలని వారు సూచించినట్టుగా సమాచారం. సెన్సార్ సభ్యుల సూచనలకు తగినట్టుగా ఈ సినిమా యూనిట్ సభ్యులు, ఆయా సన్నివేశాలను తొలగించే పనిలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.  ఈ సినిమాలో ఆయన జోడీగా మెహ్రీన్ అలరించనున్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: