సంక్రాంతి సీజన్ తో సమానంగా ఈ అక్టోబర్ లో రాబోతున్న దసరా పండుగను సెలవులను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న రెండువందల కోట్ల జూదం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. వాస్తవానికి సంక్రాంతితో పోల్చుకుంటే దసరా సీజన్ సినిమాలకు చాల చిన్నది. అయినా ఇవేమీ లెక్క చేయకుండా అక్టోబర్ 5 నుండి టాలీవుడ్ దసరా వార్ విజయ్ దేవరకొండ ‘నోటా’ తో ప్రారంభం అవుతోంది.
Nota trailer Vijay Deverakond
వాస్తవానికి ఇది తెలుగు డబ్బింగ్ అయినా ఆవిషయం ఎక్కడా బయటకు రానీయకుండా విజయ్ దేవరకొండ మ్యానియాతో సంచలనాలు సృష్టించాలని ఈమూవీ నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. విజయ్ అభిమానులు కూడ ‘గీత గోవిందం’ హిట్ ను మించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘నోటా’ ఇస్తుందని తెగ అంచనాలు పెట్టుకుంటున్నారు. 
Jr NTR in Aravinda Sametha
అదేవిధంగా ఈనెల 11న విడుదల కాబోతున్న ‘అరవింద సమేత’ రికార్డులను క్రియేట్ చేస్తుందని మరో రెండు సంవత్సరాల వరకు జూనియర్ నుండి మరో సినిమా రాని నేపధ్యంలో ఆలోటును ‘అరవింద సమేత’ తీరుస్తుందని తారక్ అభిమానులు కలలు కంటున్నారు. దీనితో విజయ్ జూనియర్ అభిమానుల విపరీతమైన అంచనాల మధ్య ఈ రెండు సినిమాలు విడుదల అవుతున్నాయి. నిజానికి ‘నోటా’ ప్రస్తుత రాజకీయాల పై ప్రశ్నలు వేసే రాజకీయ సినిమా.
Ram Pothineni Look Test For Hello Guru Prema Kosame - Sakshi
‘అరవింద సమేత’ హింస కన్నా మనిషి ప్రాణం గొప్పది అని తెలియచేస్తూ ఒక వ్యక్తి మరొక వ్యక్తని అభిమానించడంలో ఉండే ఆనందాన్ని తెలియ చేస్తూ ఒక సెంటిమెంట్ తో కూడిన సినిమా. దీనితో ఈరెండు సినిమాలలోను అంతర్లీనంగా కమర్షియల్ అంశాలతో పాటు సందేశాలు ఉన్నాయి. దీనితో ఒకే నెలలో వరసగా రెండు సందేశాలు ఇచ్చే సినిమాలను హిట్స్ ఇస్తూ  ప్రస్తుత తరం ప్రేక్షకులు చూస్తారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ రెండు సినిమాల పోటీని లెక్క చేయకుండా దసరా రోజున రామ్ ‘హలో గురు ప్రేమకోసమే’ విశాల్ ‘పందెం కోడి 2’ విడుదల కాబోతున్నాయి. వీటి మధ్య తాము కూడ ఉన్నాము అంటూ ఇదే నెలలో నారా రోహిత్ సుధీర్ బాబుల ‘వీర భోగ వసంతరాయలు’ విడుదల అవుతున్న నేపధ్యంలో ఈ రెండు వందల కోట్ల బిజినెస్ లో ఎంతమందికి లాభాలు వస్తాయి మరెంత మందికి నష్టాలు వస్తాయి అన్న విషయంలో ఇండస్ట్రీ వర్గాలు ఎవరి లెక్కలు వారు కడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: