జూనియర్ ఎన్టీఆర్ ఎగిరి గంతేసాడు, అంత సంబరం ఆయనకు ఏది కలిగించింది అనుకుంటున్నారా.. అంటే ఆయన సినిమా ఏదో బంపర్ హిట్టవ్వాలి, కాని ఆయన సినిమా విడుదల కాలేదు, పైగా విడుదలపై ఆయనకు బెంగనే ఉంది. మరేంటి ఆయన సాదించింది.

ఆయన సినిమానే అదరగొట్టింది, ఆయన కెరియర్ లోనే తొలి రికార్డును తెచ్చిపెట్టింది. సెప్టెంబర్ 27 న విడుదలకు సిద్దమవుతున్న ‘రామయ్యా వస్తావయ్యా’ సెకండ్ టీజర్ విడుదలై మూడు రోజులయింది. జాబిలమ్మ పాటతో విడుదలయిన ఈ టీజర్ కు యూట్యూబ్ లో మూడురోజుల్లో ఏకంగా 10 లక్షల వ్యూస్ వచ్చాయి.

ఇంత వ్యూస్ రావడం ఎన్టీఆర్ కెరియర్ లో ఇదే మొదటిసారి అన్నాడు నిర్మాత దిల్ రాజు. జాబిలమ్మ పాట కూడా మంచి సెన్సేషన్ హిట్టు సాదిస్తుందని అన్నారు. ఇంకా ఆయన హీరోగా వస్తున్న రభస, హడల్ కూడా మరింత రికార్డులు తెచ్చిపెడుతుందని అంటున్నారు ఆయన సన్నిహితులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: