ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించిన బిగ్ బాస్ రియాల్టీ షో భారత దేశంలో కూడా బాగా పాపులర్ అయింది.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 12 నడుస్తుందంటే..ఈ షోకి ఎంత క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే.  తెలుగు, తమిళ, కన్నడ, మళియాళ భాషల్లో కూడా బిగ్ బాస్ సీజన్ 2 కి మంచి ఆదరణ లభించింది.  తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హూస్ట్ గా వ్యవరించారు.   ఈ సీజన్ లో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు.  ఇక బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా వ్యవహరించారు.  గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 2 పూర్తయ్యింది..విన్నర్ గా కౌశల్ గెలిచాడు.  అయితే వచ్చే బిగ్ బాస్ సీజన్ 3 కి ఎవరు హూస్ట్ గా వ్యవహరిస్తారన్న విషయంపై రక రకాల చర్చలు జరుగుతున్నాయి.   

ఇటీవ‌ల నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా `బిగ్‌బాస్‌-2` సీజ‌న్ ముగిసింది. ఇదే త‌న చివ‌రి సీజ‌న్ అని ట్విట‌ర్ ద్వారా ప్ర‌క‌టించాడు. ``బిగ్‌బాస్‌` జ‌ర్నీ చాలా అద్భుతం. ఎన్నో విష‌యాలు నేర్చుకున్నా. వ్యాఖ్యాత‌గా నేను న‌చ్చిన‌వారికి ధ‌న్యవాదాలు.. న‌చ్చ‌నివారిని థియేట‌ర్‌లో క‌లుసుకుందాం. `బిగ్‌బాస్‌`కి ఇంక సెల‌వు` అని నాని ప్ర‌క‌టించాడు.  అంతే వచ్చే సీజన్ కి మనోడు లేడని ఖాయం అయ్యింది.  బిగ్ బాస్ 3 కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు ఇప్పుడు మూడో సీజన్‌ని ఎవ‌రు హోస్ట్ చేస్తే బాగుంటుంది అనే దానిపై ఆస‌క్త‌క‌ర చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. 

దాంతో ఇప్పుడు యూత్ కి బాగా కనెక్ట్ అయిన విజయ్ దేవరకొండ చేస్తే బాగుంటుందని కొంత మంది అనుకుంటున్నారు. మరోవైపు బాహుబలి తో బాగా పాపులర్ అయిన రానా చేస్తే బాగుంటుందని..ఇప్పటికే పలు షోలు కూడా నిర్వహించారని అంటున్నారు.  ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బుల్లితెరపై కనిపిస్తే..ఆ కిక్కే వేరప్ప అంటున్నారు. మ‌రి వీరి ముగ్గురిలో బుల్లితెర‌పై హోస్ట్‌గా ఎవ‌రు ప్ర‌త్య‌క్షం అవుతారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: