సాధారణంగా సెలబ్రెటీలు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని..సొసైటీలో తమకు ఎంతో ప్రత్యేకత ఉంటుందని..తాము బయటకు వస్తే..వేల సంఖ్యలో అభిమానులు తమ వెంట ఉంటారని మనస్థత్వం ఉంటుంది.   తాజాగా ఇదే పందాలో నడుస్తూ..ప్రభుత్వాన్ని లెక్కచేయని విధంగా ప్రవర్తించిన ప్రముఖ చైనీస్ నటికి అక్కడ ప్రభుత్వం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రముఖ చైనీస్ నటి, మోడల్, గాయని ఫ్యాన్ బింగ్ బింగ్(37) పన్ను ఎగవేత కేసులో రూ.945 కోట్ల జరిమానా కట్టాల్సిందిగా చైనా ఉన్నతాధికారులు ఆమెను ఆదేశించారు. 

విచారణలో భాగంగా చైనా అధికారులు ఇప్పటికే బింగ్ బింగ్ అధికార ప్రతినిధిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బింగ్ బింగ్ హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఎక్స్‌ మ్యాన్‌, ఐరన్‌మ్యాన్‌, యాష్‌ ఈజ్‌ పూరెస్ట్‌ వైట్‌ సహా పలు చిత్రాల్లో నటించింది. యితే కొన్ని సినిమాలకు సంబంధించి బింగ్ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు.

ఆ విషయం గురించి ఆమెకు హెచ్చరికలు కూడా జారీ చేశారు.  కానీ బింగ్ బింగ్ ఏమీ పట్టించుకోక పోవడంతో..  దాదాపు 129 మిలియన్ డాలర్లు(రూ.945 కోట్లు) కట్టాల్సిందిగా చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ట్యాక్సేషన్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ నిర్దేశిత జరిమానాను చెల్లించకుంటే క్రిమినల్ విచారణును ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని ఆదేశించింది.

ఈ నోటీసుపై బింగ్ స్పందించింది. అయితే దీనిపై స్పందించి  దేశ చట్టాలకు తాను చాలా గౌరవం ఇస్తానని బింగ్ తెలిపింది. తన ప్రవర్తన, చట్టాల దుర్వినియోగంపై సిగ్గుపడుతున్నానని చెప్పింది. ఈ విషయంలో  దేశంలోని  ప్రతి ఒక్కరినీ క్షమాపణ కోరుతున్నానని చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వైబోలో ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. చైనాలో లగ్జరీ ఎండార్స్‌మెంట్లతో, అత్యధిక పారితోషికం అందుకునే బింగ్  జూలై 1 నుంచి సడెన్ గా అదృశ్యమైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: