శ్రీరెడ్డి ఇప్పడూ ఈ పేరు చెబితే సినిమా వారికి ఎదో తెలియని దడ అని చెప్పొచ్చు సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరిట పెద్ద ఉద్యమాన్నే నడిపింది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులపై ప్రత్యక్షంగా, మరికొందరు స్టార్స్ పై పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈమె కోలీవుడ్ కు కూడా తన కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్ని విస్తరించింది. ఇప్పుడీమె నటుడు రాజేంద్రప్రసాద్ ను టార్గెట్ చేసింది. 

Image result for srireddy

మా అసోసియేషన్ నుంచి 6 నెలల్లోనే ఎందుకు నువ్వు బయటకొచ్చావో అందరికీ తెలుసు. హీరోయిన్ మాళవిక ఎందుకు ఇండస్ట్రీ నుంచి తప్పుకుందో అందరికీ తెలుసు. నీ లైంగిక వాంఛ కోసం ఎంతమంది మహిళా ఆర్టిస్టుల్ని ఇరిటేట్ చేశావో అందరికీ తెలుసు." ఇలా రాజేంద్రప్రసాద్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడింది శ్రీరెడ్డి. ఇక్కడితో ఆగకుండా అతడి వ్యక్తిగత విషయాల్ని కూడా ప్రస్తావించింది. రాజేంద్రప్రసాద్ కూతురు ఇంటి నుంచి ఎందుకు వెళ్లిపోయిందో అందరికీ తెలుసంటూ విమర్శలు చేసింది. చివరికి నటి హేమ ఎందుకు రాజేంద్రప్రసాద్ తో ఫైట్ చేస్తుందో కూడా అందరికీ తెలుసంటోంది శ్రీరెడ్డి. 

Image result for actor rajendra prasad

ఇలా అందరికీ తెలుసంటూ ప్రశ్నలు సంధించిన శ్రీరెడ్డి, వాటికి తను మాత్రం సమాధానాలు ఇవ్వలేదు. ఓ సీనియర్ నటుడిగా రాజేంద్రప్రసాద్ ను గౌరవిస్తానని, కానీ ఓ మనిషిగా అతడ్ని గౌరవించనని శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.  మహిళలకు అస్సలు గౌరవం ఇవ్వని రాజేంద్రప్రసాద్ దగ్గర్లో ఎక్కడైనా పిచ్చాసుపత్రి ఉంటే వెళ్లి చూపించుకోవాలని సలహా ఇచ్చింది. త్వరలోనే రాజేంద్రప్రసాద్ కు బొమ్మ చూపిస్తామంటూ ఘాటుగా పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: