బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ గెలవడానికి ఆయన అభిమానులు 'కౌశల్ ఆర్మీ'గా ఏర్పడి భారీగా కాంపెయన్ చేయడమే కారణమే అని అందరికీ తెలిసిందే.  ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ హౌజ్ లోకి 17 మంది ఇంటి సభ్యులుగా ఎంట్రీ ఇచ్చారు.  ఇందులో ముగ్గురు కామన్ మాన్ గా ఉన్న ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  ఈసారి బిగ్ బాస్ సీజన్ 2 మొదట్లో చప్పగా సాగింది..ఇక మూడో వారం నుంచి గ్రూపులు, గొడవలు..ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం తో రచ్చ మొదలైంది. గత బిగ్ బాస్ సీజన్ తో పోల్చుకుంటే..ఈ బిగ్ బాస్ చాలా దారుణంగా ఉందని మొదట్లో కామెంట్స్ వచ్చాయి.  టాస్క్ ల మద్య గొడవలు..గ్రూపులు..ఒకరి కోసం మరొకరు త్యాగం చేసుకోవడం లాంటివి జరిగాయి. 


అయితే వీటన్నింటికి భిన్నంగా మొదటి నుంచి తన గేమ్ తాను ఆడుతూ..ఎవరితూ బంధాలు, బంధుత్వాలు పెట్టుకొనని ముందుకు సాగాడు కౌశల్. అప్పటి నుంచి కౌశల్ ని టార్గెట్ చేసుకొని ఇంటి సభ్యులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ వచ్చారు.  వీటన్నింటిని ప్రత్యక్షంగా చూస్తున్న బిగ్ బాస్ వీక్షకులు ‘కౌశల్ ఆర్మీ’ ఏర్పాటు చేసి కౌశల్ కి సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు.  మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచాడు.  ఇదిలా ఉంటే కౌశల్ పై బిగ్ బాస్ హౌజ్ లో టార్గెట్ చేసిన వారిపై బయట నుంచి దారుణమైన ట్రోలింగ్స్ వస్తున్నాయని వీటిని వెంటనే అరికట్టాలని కొంత మంది ఇంటి సభ్యులు కోరుతున్నారు. 


తాజాగా బిగ్ బాస్ 2 సీజన్ లో ఫైనల్ కి చేరుకున్న వారిలో ఒకరు సామ్రాట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ట్రోలింగ్ అనేది చాలా దారుణంగా జరిగింది. దాని వల్ల అందరూ ఇబ్బందిగా పీలవుతున్నారు. పర్సనల్ లెవల్లో ట్రోలింగ్ చేయడం ఎవరికీ ఇష్టం ఉండదు. ముఖ్యంగా ఆడవారి విషయంలో. మగాళ్లు అయితే లైట్ తీసుకోవచ్చు. ఆడవారి మీద అంత ట్రోలింగ్ చేయడం చాలా దారుణం. దీనిపై చాలా అసంతృప్తిగా ఉన్నానని అన్నాడు. నాపైన కూడా చాలా ట్రోల్స్ వచ్చాయని విన్నాను. కానీ పూర్తిగా చూడలేదు. దేనికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది. జనరల్‌గా ట్రోల్ చేస్తే ఓకే... వ్యక్తిగత విషయాలతో వారు ప్రొఫెషనల్‌గా కూడా ఇబ్బంది కలుగుతుందని వారు గుర్తించాలని అన్నాడు.


అంతే కాదు నాని అన్న మీద కూడా ట్రోలింగ్ జరిగింది. ఆయన సినిమాకు అడ్డంకి కలిగించే స్థాయిలో కక్ష పెంచుకోవడం మరీ దారుణం. బిగ్ బాస్ 1 సీజన్తో పోలిస్తే బిగ్ బాస్ 2లో పరిస్థితి భిన్నంగా ఉన్న మాట వాస్తవం... అని సామ్రాట్ అన్నారు. బయటకు వచ్చిన తర్వాత కౌశల్‌కు ఉన్న అభిమానులను చూసి ఆశ్చర్య పోయాను. అభిమానం అనేది అందరికీ ముఖ్యమే. నీకు టైటిల్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఈ అభిమానంతో నీకు రెస్పాన్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అయింది. ఎవరైతే ఆ ట్రోల్స్ చేస్తున్నారో దాన్ని ఆపించు. ఇదీ నీకు నా హంబుల్ రిక్వెస్ట్...అంటూ కౌశల్ ని సామ్రాట్ కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: