ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.  అంతే కాదు దర్శక, నిర్మాతల తనయులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మద్య హీరోయిన్ల వారసులు, కీలకమైన పాత్రలను పోషించే క్యారక్టర్ ఆర్టిస్టుల వారసులు కూడా హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు.  తాజాగా ఇండస్ట్రీలోకి మరో స్టార్ నటుడి తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. 

ప్రముఖ నటుడు నాజర్ రెండవ తనయుడు ఉత్సాహాన్ని చూపుతున్నాడట.  ఇందుకోసం నాజర్ దగ్గరుండి మరీ అన్ని విషయాలు చూసుకుంటున్నట్టుగా సమాచారం. రాజ్ కమల్ ఫిల్మ్స్ వారు డిఫరెంట్ కాన్సెప్ట్ తో  ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. ఈ చిత్రంలో హీరోగా నాజర్ రెండవ తనయుడు 'అబీ మెహదీ'ని ఎంపిక చేసుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.  


త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు సమాచారం.  ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తారట.  తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నాజర్ ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి మెప్పించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: