తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ తనయుడు రాంచరణ్ ‘చిరుత’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.  రెండో చిత్రం ‘మగధీర’తో అప్పటి ఉమ్మడి రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో రికార్డుల మోత మోగించాడు.  ఇండస్ట్రీలో రాంచరణ్ నటించిన చిత్రాలు తక్కువే అయినా సూపర్ హిట్ చిత్రాలే ఎక్కువ ఉన్నాయి.  ఈ సంవత్సరం సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో రాంచరణ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు.  ఓ వైపు హీరోగా కొనసాగుతూనే బిజినెస్ రంగంలో కూడా తన సత్తా చాటుతున్నాడు.  ఖైదీ నెంబర్ 150 చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టిన రాంచరణ్ ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది.  ఈ మద్యనే అజార్బైజాన్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న మెగాస్టార్ సైరా నిర్మాణపనులు చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి పనిచేస్తున్న సిబ్బంది విషయంలో రాంచరణ్ చేసిన పనికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.  ఇంతకీ రాంచరణ్ చేసిన పనేంటో తెలుసా..ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రం జార్జియాలో భారీ షెడ్యూల్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.రాంచరణ్ నిర్మాణ పనులు చోసుకుంటున్నాడు.

 ఈ షెడ్యూల్ కోసమే దాదాపు 50 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.   షూటింగ్ లో పాల్గొన్న సిబ్బందికి కాస్త రిలీఫ్ ఇవ్వడమే కాదు...   అందరికి రాంచరణ్ షాపింగ్ కోసం కొంత మొత్తం వెచ్చించినట్లు తెలుస్తోంది. తన అసిస్టెంట్స్ ని పంపి సైరా సిబ్బంది చేత జార్జియాలో షాపింగ్ చేయించాడట. దాంతో రాంచరణ్ ని సిబ్బంది ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. సెట్ లో ఏదైనా పొరపాటు జరిగినా కూడా రవ్వంత కోపం కూడా ప్రదర్శించడం లేదని, అందరితో ప్రేమగా ఉంటున్నాడని ప్రశంసిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: